Begin typing your search above and press return to search.
చేతులు కాలిపోయిన తర్వాత ఇపుడు చర్యలా ?
By: Tupaki Desk | 29 April 2021 1:30 PM GMTనరేంద్రమోడి ప్రభుత్వ వ్యవహారం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. దేశమంతా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతికి వణికిపోతుంటే ఇపుడు ఆక్సిజన్ ప్లాంట్లని, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలని హడావుడి చేస్తోంది. గడచిన నెలరోజులుగా దేశంలో రోజుకు లక్షల కేసులు నమోదవుతున్నాయి. అలాగే వేలాదిమంది రోగులు చనిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రోజుకు 3.6 లక్షల కేసులు రికార్డుస్ధాయిలో నమోదవుతుంటే మరో 3 వేలమంది చనిపోతున్నారు.
చనిపోతున్న రోగుల్లో అత్యధికులు ఆక్సిజన్ అందక, భయంతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆక్సిజన్ సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెప్పటమే కానీ వాస్తవానికి అవసరమైనవారందరికీ దొరకటంలేదు. దీంతో ఆక్సిజన్ కోసం దేశమంతా అల్లకల్లోలం అయిపోతోంది. ఇలాంటి నేపధ్యంలో లక్ష పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కొనుగోలుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం పీఎం కేర్స్ కు వచ్చిన నిధులను ఖర్చుపెట్టాలని డిసైడ్ చేసింది.
అలాగే పీఎం కేర్స్ నిధుల నుండి కేటాయించిన 713 ఆక్సిజన్ ప్లాంట్లకు అదనంగా మరో 500 ప్లాంట్లను మంజూరుచేసింది. ఇవన్నీ మూడు నెలల్లో ఏర్పాటవుతాయట. అంటే ఇవేవీ అవసరాలకు జనాలను ఆదుకునే అవకాశం లేదు. ఈ మొత్తం ప్లాంట్లను అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల వారీగా కేటాయించబోతున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లను సమస్య ఎక్కువగా ఉన్న జిల్లాలు, నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నిర్ణయించారు.
కరోనా వైరస్ మొదటిదశ తర్వాత కేంద్రం పూర్తిగా రిలాక్సేషన్ మోడ్ లోకి వెళిపోయింది. కరోనా జాగ్రత్తలను గాలికొదిలేసింది. దాంతో రాష్ట్రాలు కూడా పట్టించుకోవటం మానేశాయి. ఇదే అవకాశంగా జనాల్లో విపరీతమైన నిర్లక్ష్యం పెరిగిపోయింది. మనదేశంలో మొదలవ్వటానికి ముందే కొన్ని యూరోపు దేశాల్లో సెకెండ్ వేవ్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అందరు చూశారు. అప్పుడు కూడా నరేంద్రమోడి మేల్కోనలేదు.
అప్పట్లోనే ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, ఆక్సిజన్ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు, బెడ్లు, వెంటిలేటర్ల ఉత్పత్తి, టీకాల ఉత్పత్తి, సరఫరా తదితరాలపై దృష్టి పెట్టుంటే ఇపుడింత సమస్య ఉండేదికాదు. పీఎం కేర్స్ లో వేలాది కోట్ల రూపాయలు పెట్టుకుని కూడా సకాలంలో ఖర్చులు పెట్టలేదు. ఎంతసేపు ఎన్నికల్లో లబ్దిపొందాలనే యావే తప్ప ప్రజారోగ్యాన్ని కాపాడాలన్న ఆలోచన ఎక్కడా కనబడలేదు. దీని ఫలితమే ఇపుడు జనాలు అనుభవిస్తున్నారు.