Begin typing your search above and press return to search.

బాబును తిడితే!...మోదీకెంత సంతోష‌మో?

By:  Tupaki Desk   |   3 Jan 2019 3:04 PM GMT
బాబును తిడితే!...మోదీకెంత సంతోష‌మో?
X
టీడీపీ అధినేత‌. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుపై ఇప్పుడు దాదాపుగా అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌ల జ‌డివాన కురుస్తోంది. రాజ‌కీయ ప‌రంగా వైరి వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు దూసుకురావ‌డం స‌హ‌జ‌మే అనుకున్నా.... చంద్ర‌బాబు విష‌యంలో ఇంకేదో కార‌ణం ఉంద‌ని మాత్రం చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... రాజ‌కీయంగా త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రితోనైనా క‌లిసి ముందుకు సాగ‌డం - ఆ తర్వాత త‌న ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించిన వారిని కూర‌లో క‌రివేపాకులా తీసివేయ‌డం చంద్ర‌బాబు నైజ‌మ‌న్న విష‌యం తెలిసిందే క‌దా. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీ - జ‌న‌సేన‌ల‌తో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన చంద్రబాబు అధికార ప‌గ్గాల‌ను చేజిక్కించుకున్నారు. అయితే త‌న విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన బీజేపీ. జ‌న‌సేన‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌కుండానే చంద్ర‌బాబు త‌న‌దైన శైలి పాల‌న‌ను సాగించార‌న్న వాద‌న లేకపోలేదు.

ఈ కార‌ణంగానే ఇటు రాష్ట్రంలో - అటు కేంద్రంలో బీజేపీ - టీడీపీలు భాగ‌స్వాములుగానే కొన‌సాగినా... టీడీపీ పాల‌న‌లో అవినీతి చోటుచేసుకుంటోంద‌ని బ‌హిరంగంగానే బీజేపీ నేత‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చెప్పిన‌ట్లుగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌ని - ప్ర‌త్యేక ప్యాకేజీనే ముద్ద‌ని - ఇక‌పై ఎవ‌రైనా ప్ర‌త్యేక ప్యాకేజీ అంటే జైల్లో పెట్టేస్తాన‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు... ఆ తర్వాత బీజేపీ ప్ర‌మేయం లేకుండానే ఆ పార్టీకి క‌టీఫ్ చెప్పారు. ఫ‌లితంగా అప్ప‌టిదాకా ఇరు పార్టీల మ‌ధ్య కొన‌సాగిన మైత్రి కాస్త శ‌త్రు రూపం దాల్చింది. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీలకు చెందిన నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ప్ర‌ధాని మోదీ కొంత‌మేర సంయ‌మ‌నం పాటిస్తున్నా... చంద్ర‌బాబు మాత్రం మోదీపైనే నేరుగా ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రారంభించారు. మొన్న‌టిదాకా చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను అంత‌గా ప‌ట్టించుకోని మోదీ... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో బ‌దులిచ్చేందుకు రంగంలోకి దిగిపోయారు. ఈ క్ర‌మంలో మొన్న‌ - నిన్న చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నిన్న ఏపీకి చెందిన ప‌లు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై మోదీ విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన మోదీ... కార్య‌క‌ర్త‌లు చెప్పిన విష‌యాల‌ను కూడా కాస్తంత శ్ర‌ద్ధ‌గానే ఆల‌కించిన‌ట్టుగా స‌మాచారం. ఈ క్ర‌మంలోనే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి స్థాయిలో కాన్ఫ‌రెన్స్‌ లో పాలుపంచుకున్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ... చంద్ర‌బాబుపై మోదీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ స‌ర్కారు అవినీతి పాల‌న‌ను సాగిస్తోంద‌ని - రాష్ట్రం మొత్తాన్ని దోచేస్తోంద‌ని క‌న్నా ఆరోపించారు. అంత‌టితో ఆగ‌ని క‌న్నా... చంద్ర‌బాబుపై మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. *చంద్ర‌బాబు ఒక అబ‌ద్దాల కోరు. మోస‌గాడు. ఓ లుచ్ఛా. రాష్ట్రాన్ని దోచేస్తున్నారు* అంటూ మ‌రింత‌గా రెచ్చిపోయార‌ట‌. ఈ సందర్భంగా క‌న్నా వ్యాఖ్య‌ల‌ను - చంద్ర‌బాబుపై ప్ర‌యోగించిన ఘాటు కామెంట్ల‌ను వింటూ మోదీ ముసిముసిగా న‌వ్వార‌ట‌. అంటే... చంద్ర‌బాబును తిడితే మోదీకి బ‌హు సంతోషంగా ఉన్న‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.