Begin typing your search above and press return to search.

అవును..మోడీ 4 గంట‌లు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది!

By:  Tupaki Desk   |   14 Feb 2019 11:41 AM GMT
అవును..మోడీ 4 గంట‌లు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది!
X
ఎంత‌వారైతే మాత్రం.. ఎంత ప‌వ‌ర్ చేతిలో ఉంటే మాత్రం.. ప్ర‌కృతి ముందు త‌ల వంచాల్సిందే. దేశంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కుడిగా పేరున్న ప్ర‌ధాని మోడీ నాలుగు గంట‌ల పాటు ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. ఎందుకిలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది? అన్న‌ది చూస్తే..

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తూ.. మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రుపుతున్నారు. ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని భారీగా ప్రారంభించ‌టంతో పాటు.. త‌మ ప్ర‌భుత‌వ్ం ఆయా రాష్ట్రాల‌కు ఏమేం చేసిందో చెబుతూ.. మ‌న‌సుల్ని దోచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ రోజు ఉత్త‌రాఖండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు రెఢీ అయ్యారు. ఆ రాష్ట్రంలో దాదాపు రూ.3400 కోట్ల వ్య‌యంతో ఇంటిగ్రేటెడ్ కోఆప‌రేటివ్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రాజెక్టునుమోడీ ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం ఆయ‌న ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.

అయితే.. డెహ్రాడూన్ లో వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌పోవ‌టం.. భారీగా కురుస్తున్న వ‌ర్షం కార‌ణంగా విమానం వెళ్ల‌లేని ప‌రిస్థితి. దీంతో.. వాతావ‌ర‌ణం స‌రి అయ్యే వ‌ర‌కూ ఆయ‌న నాలుగు గంట‌ల పాటు ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. దేశ ప్ర‌ధాని నాలుగు గంట‌ల పాటు వెయిట్ చేయ‌టం మామూలు విష‌యం కాదుగా. అంద‌రి మాదిరి ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఆయ‌న కూర్చోలేరు క‌దా? అందుకే.. ఆయ‌న‌కుఎయిర్ పోర్ట్ లోని ప్ర‌త్యేక గ‌దిలో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు.

వాతావ‌ర‌ణంతో ఎలాంటి ఇబ్బంది లేద‌న్న విష‌యంపై క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న త‌ర్వాత ఆయ‌న విమానం ప్ర‌యాణించ‌టానికి అధికారులు అనుమ‌తి ఇచ్చారు. మొత్తానికి దేశ ప్ర‌ధాని సైతం నాలుగు గంట‌ల పాటు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. వాతావ‌ర‌ణం విభాగం వారు.. ఈ రోజు వ‌ర్షం పడుతుంద‌న్న అంచ‌నాలు ఇచ్చిన త‌ర్వాత కూడా కార్య‌క్ర‌మాన్ని షెడ్యూల్ చేయ‌టం చూస్తే.. ఎన్నిక‌లకు రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్న విష‌యంపై మోడీ ఎంత అలెర్ట్ గా ఉన్నారో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.