Begin typing your search above and press return to search.

క్యాబినెట్ మీటింగ్ కి పిలిచి మోడీ అలా చేశారా?

By:  Tupaki Desk   |   10 Nov 2016 10:07 AM GMT
క్యాబినెట్ మీటింగ్ కి పిలిచి మోడీ అలా చేశారా?
X
పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన సంచలన ప్రకటనకు ముందు ప్రధాని మోడీ ఏం చేశారు? ఈ విషయాన్ని ఆయన ఎవరితో మాట్లాడారు? మంత్రివర్గ సహచరులకు ఆయనీ విషయాన్ని ఎప్పుడు చెప్పారు? కీలకమైన ఆర్ బీఐ అధికారులకు ఎప్పుడు తెలిసింది? పెద్దనోట్ల రద్దు విషయంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని చెప్పిన తర్వాత మంత్రులతోనూ.. ఆర్ బీఐ అధికారుల్ని మోడీ ఏం చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వింటే షాక్ తినక మానరు. పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ భారీ గుట్టు ప్రదర్శించటమే కాదు.. ఊహించని తీరులో వ్యవహరించి అందరికి షాకిచ్చారని చెబుతున్నారు.

మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల వేళ.. అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులంతా క్యాబినెట్ మీటింగ్ కు రావాలని పీఎంవో నుంచి సమాచారం వెళ్లిందట. ఉన్నట్లుండి క్యాబినెట్ మీటింగ్ ఎందుకని ఆరా తీసిన వారికి.. జపాన్ పర్యటన సందర్భంగా మాట్లడటానికి అన్న సమాచారం వచ్చిందట. అనంతరం సాయంత్రం6.45 గంటల వేళ మంత్రులతో క్యాబినెట్ సమావేశాన్ని మోడీ నిర్వహించారు.

ఇదే సమావేశానికి ఆర్ బీఐకి చెందిన కీలక అధికారుల్ని కూడా ఆహ్వానించారు. ఆర్ బీఐ అధికారుల్ని క్యాబినెట్ మీటింగ్ కు ఆహ్వానించిన విషయాన్ని మంత్రులకు తెలీకుండా పీఎంవో జాగ్రత్త పడిందని చెబుతున్నారు. ఇక.. మీటింగ్ మొదలైన తర్వాత తాను తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించిన ప్రధాని.. అది కూడా ఆ రోజు అర్థరాత్రి నుంచే పెద్దనోట్ల చెల్లుబాటు ఆగిపోతందన్న విషయాన్ని సహచరులకు చెప్పారట.

క్యాబినెట్ మీటింగ్ అయ్యాక.. మంత్రుల్ని.. ఆర్ బీఐ అధికారుల్ని బయటకు పోనివ్వలేదట. తన ప్రకటన ఎక్కడా లీక్ కాకూడన్న ఉదేశంతో మంత్రుల్ని.. ఆర్ బీఐ అధికారుల్ని ఒక గదిలో ఉంచేశారట. మంత్రివర్గ సమావేశాలకు సెల్ ఫోన్ అనుమతించని నేపథ్యంలో తమకు తెలిసిన సమాచారాన్ని బయటకు పంపే వీలు మంత్రులకు లేకపోయింది. అందరిని ఒక గదిలో ఉంచేసిన ప్రధాని మోడీ.. దేశ ప్రజలను ఉద్దేశించి టీవీల్లో ప్రసంగించటం.. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన సంచలన విషయాన్ని వెల్లడించారు. దేశ ప్రజలందరికి తాను చెప్పాల్సిన విషయాన్ని తానే స్వయంగా చెప్పిన తర్వాత.. మంత్రుల్ని.. ఆర్ బీఐ అధికారుల్ని గది నుంచి బయటకు పంపినట్లుగా చెబుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఈ కథనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/