Begin typing your search above and press return to search.

పంచెకట్టులో అదరగొట్టిన మోదీ.. నెటిజన్లు ఫిదా..!

By:  Tupaki Desk   |   19 Nov 2022 11:55 AM GMT
పంచెకట్టులో అదరగొట్టిన మోదీ.. నెటిజన్లు ఫిదా..!
X
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటారనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. విదేశాలకు వెళ్లినప్పుడు సూట్ లో కనిపించే మోదీ.. ఎన్నికల ప్రచారంలో మాత్రం డిఫరెంట్ గెటప్స్ తో అలరిస్తుంటారు. ఏ రాష్ట్రానికి వెళితే అక్కడి సంప్రదాయాలు ఉట్టిపడేలా తన డ్రెస్సింగ్ ఉండేలా మోదీ జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారంలో మోదీ ఇలానే వ్యహరించారు. పశ్చిమ బెంగాల్ కు ఐకాన్ గా ఉన్నటువంటి రవీంద్ర నాథ్ ఠాగూర్ మాదిరిగా గుబురు గడ్డంతో.. ఆయనలా కన్పించేలా డ్రెస్సింగ్ చేసుకొని అక్కడి ఓట్లర్లను ఆకట్టుకున్నారు. అయితే ఇక్కడి బీజేపీ రెండో స్థానానికే పరిమితమైనప్పటికీ మోదీ తీరు అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రతిపక్ష నేతలు సైతం మోదీ డ్రెస్సింగ్ తీరుపై సెటైర్లు వేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదు. అలాగే ఆర్మీకి సంబంధించి ఏదైనా కార్యక్రమం ఉంటే సైన్యం దుస్తులనే మోదీ ధరించి వారిలో ఆత్మస్థైర్యం నింపిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.

తాజాగా మోదీ పంచెకట్టు కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశారు. పంచెకట్టులోనూ తనకు సాటి ఎవరూ లేరు అనేలా మోదీ స్పెషల్ గా కనిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లో కాశీ తమిళ సంగమం జరుగుతోంది.

ఈ కార్యక్రమానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వారణాసికి వెళ్లారు. విమానం నుంచి మోదీ దిగుతూనే పంచెకట్టులో స్పెషల్ గా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

దేశంలో పురాతనమైన తమిళనాడు.. కాళీ మధ్య సంబంధాలను మరింత బలపరిచేలా కాళీ తమిళ సంగమం కార్యక్రమాలు కేంద్రం నిర్వహిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.