Begin typing your search above and press return to search.

మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో అపశృతి

By:  Tupaki Desk   |   26 Sep 2015 7:01 AM GMT
మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో అపశృతి
X
అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ జాతీయ జెండా పై సంతకం చేసినట్టు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. జాతీయ జెండా నియమాలను ప్రధాని ఉల్లంఘించారంటూ సామాజిక మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. #ModiDisrespectsTricolor హ్యాష్‌ టాగ్‌ తో ఈ అంశం ఫేస్‌ బుక్ - ట్విట్ట‌ర్‌ ల‌లో టాప్ వ‌న్‌ లో నిలుస్తోంది.

ఫార్చ్యూన్ 500 వాణిజ్యవేత్తలకు అమెరికాలో ప్రధాని మెడీ విందు ఇచ్చారు. ఈ విందు పదార్థాలను ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు వికాస్‌ ఖన్నా సిద్ధం చేశారు. అద్భుతంగా వంట‌కాలు సిద్ధం చేశావంటూ మోడీ ఓ పెయింటింగ్ వస్ర్తం పై సంత‌కం చేసి ఖ‌న్నాకు అంద‌జేశారు. దాన్ని ఆయన మీడియాకు కూడా ప్రదర్శించారు. అయితే మోడీ సంత‌కం చేసింది జాతీయ ప‌తాకం అని మీడియాలో వార్త‌లు వెలువ‌డ్డాయి. పలువురు దీన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనిపై కలకలం రేకెత్తిన నేపథ్యంలో అధికారులు ఆ పెయింటింగ్‌ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే మోడీ సంతకం చేసింది జాతీయ జెండా పై కాదని, దానిని తాము వికాస్ ఖన్నా నుంచి స్వాధీనం చేసుకోలేదని ప్రభుత్వ ప్రతినిధి ఫ్రాంక్ నొరోనా స్పష్టం చేశారు. ఖన్నాతో పాటు ఓ వికలాంగురాలు మోడీని కలుసుకుందని, ఆమె తన కాలితో ఓ వస్త్రంపై వేసిన పెయింటింగ్‌ పై మోదీ సంతకం చేశారని ఆయన వివరించారు. ఆ వస్త్రం పై తెల్లటి రంగు - అలాగే అశోక చక్రం లేవని తెలిపారు. భారత జాతీయ పతాకం నియమావళి ప్రకారం జెండాపై ఎటువంటి గీతలు గీసినా, అది జెండాను అవమానించినట్టేన‌ని, జాతీయ జెండా పై ప్రధాని సంతకం చేయడం నేరమని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌ దీప్ సుర్జేవాలా అన్నారు.