Begin typing your search above and press return to search.
అగ్రరాజ్య అధినేతకు మించి దూసుకెళ్లి నెంబర్ వన్ గా మోడీ
By: Tupaki Desk | 27 Aug 2022 4:30 AM GMTకొన్నిసార్లు అంతే. కాలం కొందరిని తిరుగులేని రీతిలో తీసుకెళుతుంటుంది. వారేం చేపినా ఎదురే ఉండదు. ప్రస్తుతం అలాంటి ఇమేజ్ తో దూసుకెళుతున్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఆయన ప్రభుత్వం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై కోట్లాది మంది మండిపాటును వ్యక్తం చేస్తున్నా.. ఆయన్ను అభిమానించి.. ఆరాధించే విషయంలో మాత్రం తిరుగులేని రీతిలో సాగుతున్న ఆయన ఇమేజ్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఒక సంస్థ చేపట్టిన రేటింగ్స్ లో ప్రపంచంలోని దేశాధినేతల్లో నరేంద్ర మోడీ మరోసారి నెంబర్ వన్ గా నిలిచారు. ఈ విషయాన్ని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది.అప్రూవల్ రేటింగ్ లో ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జోబైడెన్ కు ఏ మాత్రం అందనంత దూరంలో ఆయన ఇమేజ్ ఉందన్న విషయాన్ని తాజా రిపోర్టు వెల్లడించింది.
డ్రోన్ టెక్నాలజీతో అప్ఘాన్ రాజధాని కాబూల్ లో అల్ ఖైదా అధినేత అల్ జవహరిని హతమార్చటం ద్వారా తన సత్తా చాటిన బైడెన్ కు.. ఈ ఎపిసోడ్ తో రేటింగ్స్ పెరుగుతాయని అందరూ అంచనా వేశారు. అయితే.. అనుకున్నంతగా ఆయనకు రేటింగ్ రాలేదు.
ఇదిలా ఉంటే.. నరేంద్ర మోడీ మాత్రం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఆగస్టు 17 నుంచి 23 మధ్యన నిర్వహించిన సర్వేలో మోడీకి 75 శాతం అప్రూవల్ రేటింగ్ రావటం విశేషం.
నరేంద్ర మోడీ తర్వాత రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ కు 63 శాతం అప్రూవల్ రేటింగ్ రాగా.. మూడో స్థానంలో ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంటోనీకి 58శాతం అప్రూవల్ రేటింగ్ వచ్చింది. అనూహ్యంగా ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్య అధినేత అయిన జో బైడెన్ కు మాత్రం కేవలం 41 శాతం అప్రూవల్ రేటింగ్ రావటం గమనార్హం.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ సంస్థ తన సర్వే ప్రారంభించిన నాటినుంచి కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీనే అత్యధిక స్థాయిలో కొనసాగుతుండటం. ఈ అధ్యయనం ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. తాజా రేటింగ్స్ తో నరేంద్ర మోడీ ఇమేజ్ ఎంత భారీగా ఉందన్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. సమీప భవిష్యత్తులో ఆయన్ను ఢీ కొట్టే పరిస్థితి లేదన్న రీతిలో ఆయన రేటింగ్ స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.