Begin typing your search above and press return to search.
చైనాకు గిఫ్ట్ ఇచ్చింది రాహుల్ తాతనే..
By: Tupaki Desk | 14 March 2019 11:42 AM GMTపాకిస్తాన్ లో నక్కి భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా ఐక్యరాజ్యసమితిలో అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు. భద్రతా మండలిలో భారత్ కు వ్యతిరేకంగా చైనా వ్యవహరించిన తర్వాత ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ నుంచి రాలేదని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. గుజరాత్ లో జీ జిన్ పింగ్ తో కలిసి చక్కర్లు కొట్టడం.. ఢిల్లీలో ఆయనను హత్తుకోవడం.. చైనాలో ఆయనకు మోకరిల్లడం.. ఇదే చైనాకు సంబంధించి మోడీ దౌత్య విధానం అంటూ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. జీ జిన్ పింగ్ ను చూసి మోడీ భయపడిపోతున్నాడన్నారు.
కాగా ఈ వ్యాఖ్యలను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మండిపడింది. అసలు మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూనే చైనాకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థానాన్ని బహుమతిగా ఇచ్చారని ధ్వజమెత్తింది. భారత్ కు రావాల్సిన ఆ స్థానాన్ని మీ ముత్తాత చైనాకు ఇచ్చారని.. మీ కుటుంబం చేసిన తప్పులనే ఇప్పుడు భారత్ అనుభవిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై నరేంద్రమోడీ ప్రభుత్వం యుద్ధం చేస్తోందని.. మీరు మాత్రం చైనా రాయబారులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించుకోండని రాహుల్ ను బీజేపీ ఎద్దేవా చేసింది.
ఉగ్రవాది మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకోవడాన్ని రాహుల్ పండుగ చేసుకుంటున్నారని తాజాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా విమర్శలు గుప్పించారు. రాహుల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ లో హైడ్ లైన్స్ అవుతున్నాయని దుయ్యబట్టారు.