Begin typing your search above and press return to search.

కళ్లం తెగినట్లుగా ఉండే పెట్రోల్ ధరలపై మోడీ తాజా మాట వింటే మంట పుట్టుడే

By:  Tupaki Desk   |   28 Feb 2022 7:09 AM GMT
కళ్లం తెగినట్లుగా ఉండే పెట్రోల్ ధరలపై మోడీ తాజా మాట వింటే మంట పుట్టుడే
X

పెట్రోల్.. డీజిల్ ధరలకు కళ్లాల్ని తెంచేసి.. సామాన్యుడి మొదలు సంపన్నుడికి సైతం మంట పుట్టేలా చేయటంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని చెప్పాలి. పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తులు మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందుకు వేరే అవకాశం లేదు. అలాంటప్పుడు.. ధరలు పెరుగుతాయన్న వాదనలో డొల్లతనం తప్పించి మరింకేమీ ఉండదు. ఇవాల్టి రోజున పెట్రోల్.. డీజిల్ ధరలు ఇంత భారీగా ఉండటంలో కేంద్రం వసూలు చేసే సుంకంతో పాటు రాష్ట్రాలు వడ్డించే పన్నుపోటుదే సింహభాగమన్నది మర్చిపోకూడదు.

ఇలాంటి విషయాలు తెలీనంతగా దేశ ప్రజలు లేరు. అయినప్పటికీ నిజాన్ని వదిలేసి.. తనకు తోచినట్లుగా మాటలు చెప్పి అడ్డంగా బుక్ అయిన ఘనత మాత్రం నరేంద్ర మోడీదే. బీజేపీ అండ్ కోకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. ఆ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే యూపీ ఎన్నికల వేళ.. పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరల వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టారు.

దీనిపై రియాక్టు అయిన ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ కావటం ఖాయమంటున్నారు. ఎందుకంటే.. పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టటంలో అర్థం లేదన్న మోడీ.. భారత్ వందశాతం పెట్రోలియం దిగుమతుల మీద ఆధారపడి ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్ లో పెట్రోల్ బావులు ఏమైనా ఉన్నాయా? రేట్లు అదుపులో ఉండటానికి? అంటూ ప్రశ్నించిన ఆయన మాటలు విన్నంతనే ఒళ్లు మండేలా ఉంటాయని చెప్పక తప్పదు. ఎందుకంటే.. చమురు బావులు దేశంలో లేవన్న విషయం చిన్న పిల్లాడికి కూడా తెలిసిన విషయమే.

ఇవాల్టి పెట్రోల్.. డీజిల్ ధరల్లో అత్యధికంగా ఉన్న పన్నుల కారణమన్న విషయం తెలియంది కాదు. ఆ మాటకు వస్తే.. పెట్రోల్.. డీజిల్ రెండింటి మీదా వ్యాట్ విధించకుండా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినా.. ఇప్పుడున్న ధరలకు భిన్నంగా అందరూ గుర్తించేంతగా ధరలు మారే అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు. ఇవన్నీ ప్రజలకు తెలియని విషయాలు కావు.

కానీ.. తన మాటలతో వాటిని మర్చిపోతారని మోడీ భావనే తప్పుగానిరూపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రతి దేశానికి కొన్ని అనుకూలతలు.. మరికొన్ని ప్రతికూలతల ఉంటాయి. ఏదైనా దేశం తనకుఅవసరమైనకొన్ని వస్తువుల విషయంలో దిగుమతుల మీద ఆధారపడి ఉంటుంది. అలా అని దిగుమతుల సుంకాన్ని.. పన్నుల్ని భారీగా పెంచేసి.. ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తామనటం తప్పే అవుతుంది కదా? ఆ విషయాన్ని దేశ ప్రజలు మర్చిపోతారంటారా మోడీజీ?