Begin typing your search above and press return to search.

`మేకిన్ ఇండియా`.. అంటాడు.. విదేశీ కారు వాడ‌తారు.. ఏంటిది మోడీ

By:  Tupaki Desk   |   25 April 2021 2:30 AM GMT
`మేకిన్ ఇండియా`.. అంటాడు.. విదేశీ కారు వాడ‌తారు.. ఏంటిది మోడీ
X
చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది మాత్రం పాడు ప‌నులు! అన్న‌ట్టుగా ఉంది.. ఘ‌న‌త వ‌హించిన మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీరు అంటున్నారు నెటిజ‌న్లు. ఆయ‌న తెల్లారిలేస్తే.. నోరు విప్పితే.. `దేశ్ వాసియోం.. ` అంటూ.. లోక‌ల్ ప్రొడ‌క్స్ మాత్ర‌మే వాడాల‌ని చెబుతుంటారు. అంతేకాదు.. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ నినాదం అందుకుంటారు. ఈ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కింద స్థానికంగా ఉత్ప‌త్తి అయ్యే వ‌స్తువులకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని .. విదేశీ వ‌స్తువుల‌ను సాధ్య‌మైనంత త‌క్కువ వినియోగించాల‌ని కూడా సూక్తులు వ‌ల్లెవేస్తుంటారు.

మ‌రీ ముఖ్యంగా క‌రోనా నేప‌థ్యంలో గ‌త ఏడాది విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ భారీ ఎత్తు న దెబ్బ‌తింద‌ని.. దీనికి జ‌వ‌స‌త్వాలు ఇచ్చేందుకు మేకిన్ ఇండియాలో భాగంగా ఉత్ప‌త్తి అయిన వాటినే వినియోగించాల‌ని, వాటినే కొనుగోలుచేయాల‌ని చెబుతుంటారు. అంతేకాదు.. దీనికి కాస్త భార‌తీయ‌త అనే సెంటిమెంటును కూడా రంగ‌రిస్తారు. మ‌హాత్మా గాంధీ స్వ‌దేశీ వ‌స్తు విధానాన్ని తెర‌మీదికి తెచ్చి మార్కులు వేయించుకుంటారు. దీంతో ఇంకేముంది.. మ‌న ప్ర‌ధానికి దేశ భ‌క్తి ఎంత ఎక్కువ‌.. గ‌తంలో ఎవ‌రూ ఇలా చెప్ప‌లేదు.. ఎవ‌రూ ఇలా చేయ‌లేదు.. అని బీజేపీ నేత‌లు బాకా ప‌ట్టుకుని ప్ర‌చారం చేస్తుంటారు.

అయితే.. మ‌రి దేశంలోని 130 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ఇంత పెద్ద ఎత్తున సుద్దులు చెప్పిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. తానుకూడా మేకిన్ ఇండియా వ‌స్తువుల‌నే వినియోగిస్తున్నారా? అంటే.. ఇదో పెద్ద మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. తాజాగా ఆయ‌న ఓ కారులో అంచుపై నిల‌బ‌డి.. అభివాదం చేస్తున్న ఫొటో ఒక‌టి.. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ ఆ కారు ఏంటంటే.. విదేశీ కంపెనీకి చెందిన‌.. `రేంజ్ రోవ‌ర్‌` కంపెనీది!

ఇప్పుడు ఈ ఫొటోను షేర్ చేస్తున్న నెటిజ‌న్లు.. దీనిపైనే ట్రోల్స్ చేస్తున్నారు. ``మాకేమో.. స్వ‌దేశీ మంత్రం బోధిస్తూ.. మీరేమో.. విదేశీ మంతం ప‌ఠిస్తున్నారా? మోడీజీ`` అంటూ.. స‌టైర్లు కుమ్మేస్తున్నారు. అయితే.. బీజేపీ నేత‌లు దీనిని తిప్పికొట్టే పప్ర‌య‌త్నం చేయొచ్చు.. అదేంటంటే.. ``రేంజ్ రోవ‌ర్ ఇండియా కంపెనీనే క‌దా! టాటా వాళ్లు కొన్నారు క‌దా`` అని..!! కానీ, ఇప్ప‌టికీ.. రేంజ్ రోవ‌ర్ లండ‌న్ కు చెందిన కంపెనీనే కావ‌డం గ‌మ‌నార్హం. స‌రే! ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టినా.. మోడీకి ఈ దేశంలో త‌యారైన కార్ల‌పై న‌మ్మ‌కం లేదా.. లేక ఆస‌క్తి లేదా? అనేది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. మ‌న ద‌గ్గ‌రే టాటా సంస్థ‌.. Tata Safari - Mahindra లేదా ఇత‌ర అనేక కంపెనీలు కార్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నాయి. మ‌రి ఈ స్వ‌దేశీ కార్ల‌ను వ‌దిలేసి.. ఆ విదేశీ కార్ల‌పై మోడీకి మోజెందుకు? అనేది నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మొత్తానికి మోడీ.. మాట‌లు చెప్ప‌డానికే ఉన్నార‌ని.. వాటిని పాటించేందుకు మాత్రం కాద‌ని అంటున్నారు నెటిజ‌న్లు!