Begin typing your search above and press return to search.
ఏమీ చేయని శిష్యుడు.. బర్త్ డే రోజున గురువు ఇంటికి వెళ్లారు
By: Tupaki Desk | 9 Nov 2020 6:45 AM GMTబీజేపీ కురువృద్ధుడు.. మోడీకి గురువు లాల్ క్రిష్ణ అద్వానీ 93వ పుట్టిన రోజు ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖ రాజకీయ నేతలంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. అద్వానీ అత్యంత ప్రియ శిష్యుడైన మోడీ.. పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లారు. పుట్టినరోజు వేడుకల్ని దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా తన ప్రియ శిష్యుడికి ప్రేమతో కేక్ తినిపించారు అద్వానీ.
గురువుగారి కాళ్లకు నమస్కారం చేసిన ఆయన.. అశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా అద్వానీఇంటికి వెళ్లటం.. అక్కడ సమయం గడపటం తనకెంతో సంతోషంగా ఉందన్న ఆయన తనతో పాటు తన నీడలాంటి అమిత్ షాను వెంటబెట్టుకెళ్లారు. పార్టీ కార్యకర్తలకు.. దేశానికి ఆయనో సజీవ ప్రేరణగా పేర్కొన్న మోడీ.. అద్వానీతో తాను దిగిన ఫోటోల్ని షేర్ చేశారు.
మిగిలిన రోజులు ఎలా ఉన్నా.. ఇలా పుట్టినరోజు సందర్భంగా అద్వానీ ఇంటికి వెళ్లే విషయంలో మాత్రం మోడీ అస్సలు మిస్ కారు. తాను తీసుకునే కీలక విషయాల్లో అద్వానీతో సంప్రదింపులు జరపటం మానేసి చాలానే ఏళ్లు అయ్యింది. అంతేకాదు.. దేశ ప్రధానమంత్రి కావాలని కల కన్న అద్వానీ అది జరగకున్నా.. రాష్ట్రపతి కావాలని భావించేవారని చెబుతారు.
తన ఆత్మీయ స్నేహితుడు వాజ్ పేయ్ ప్రధానిగా వ్యవహరించిన వేళలో.. ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన రాజకీయ జీవితంలో ఏదైనా కొరత ఉందంటే.. అది దేశ అత్యుత్తమ పదవుల్లో దేన్ని ఆయన చేపట్టకపోవటం. తన శిష్యుడే స్వయంగా ప్రధానమంత్రిగా ఉన్నప్పటికి.. గురువును రాష్ట్రపతి చేసే విషయంలో మోడీ ఆసక్తి చూపించకపోవటంపై ఇప్పటికి పార్టీలోనూ.. బయటా ఆసక్తి జరుగుతూనే ఉంటుంది. శిష్యుడిగా గురువుకు ఏమీ చేయకున్నా.. ఇలా వెళ్లి అశీర్వాదం తీసుకోవటంలో మాత్రం మోడీ ఎవరికి మాట అనే అవకాశం మాత్రం ఇవ్వరని చెప్పక తప్పదు.