Begin typing your search above and press return to search.
మోడీ ఆవేదన.. ఒక్కరోజుకే ఇలా చేస్తారా?
By: Tupaki Desk | 23 March 2020 10:45 AM GMTఈ ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన దేశ ప్రజలకు ప్రధాని మోడీ నిన్న రాత్రి కృతజ్ఞతలు తెలిపారు. కానీ సోమవారం మాత్రం పరిస్థితి రివర్స్ అయ్యింది. కొద్దిగంటలకే సోమవారం రోడ్డెక్కిన ప్రజల తీరును చూసి నరేంద్రమోడీ మనస్థాపం చెందారు. నిరాశ వ్యక్తం చేశారు.
జనతా కర్ఫ్యూ తర్వాత రోజు సోమవారం ప్రజలు బయటకు వచ్చారు. సాధారణ కార్యకలాపాలతో బిజీగా గడిపారు. రోడ్లపై ప్రజలు తిరుగుతున్న చిత్రాలు - వీడియోలు సోషల్ మీడియాలో నిండిపోయాయి.
ఇవి చూసిన కలత చెందిన మోడీ తన ట్విట్టర్ లో ఇలా ఆవేదనతో రాసుకొచ్చాడు. ‘చాలా మంది లాక్ డౌన్ ను తీవ్రంగా పరిగణించలేదు. దయచేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ కుటుంబాన్ని రక్షించండి.. సూచనలు ఖచ్చితంగా పాటించండి. నియమాలు - చట్టాలు అనుసరించాలని కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వాల తరుఫున అభ్యర్థిస్తున్నా’ అంటూ మోడీ తన ఆవేదనను వెళ్లగక్కాడు.
దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్నప్పటికీ సోమవారం ప్రజలంతా బయట తిరుగుతున్నందుకు మోడీ కలత చెంది ఈ ట్వీట్ చేశారు. మోడీ పిలుపు మేరకు ఒక్కరోజు నిర్బంధంలో ఉన్న ప్రజలు సోమవారం మాట తప్పి బయటకు రావడంతో కేంద్రం ప్రయత్నం వృథా అయ్యింది. ఇదే విషయంపై మోడీ మనస్థాపం వ్యక్తం చేశారు.