Begin typing your search above and press return to search.
రోమ్ : పోప్ ఫ్రాన్సిస్ తో మోదీ భేటీ .. కారణం ఏంటి ?
By: Tupaki Desk | 30 Oct 2021 9:44 AM GMTభారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే వాటికన్ సిటీకి చేరుకొని, పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశం అయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ ఆయన వెంట ఉన్నారు. వాటికన్ సిటీకి చేరుకున్న ప్రధానికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పోప్ ఫ్రాన్సిస్ తో ప్రధాని భేటీ మర్యాదపూరకంగా మాత్రమే కలిశారు. రోమన్ క్యాథలిక్ చర్చికి ప్రధాన కేంద్రంగా భావిస్తారు వాటికన్ సిటీని. రోమ్ నగరం మధ్యన ఉంటుంది. దీన్ని స్వతంత్ర దేశంగా భావిస్తారు. జీ20 అత్యున్నత సమావేశంలోపాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, ఇతర ఉన్నతాధికారులు రోమ్ కు చేరుకున్నారు.
ఈ జీ20 సమ్మిట్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఈ శిఖరాగ్ర సదస్సు కొనసాగుతుంది. ఇందులో పాల్గొనడానికి ముందే ప్రధాని మోడీ వాటికన్ సిటీకి చేరుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశం అయ్యారు. రోమ్ పర్యటనలో భాగంగా ప్రధాని ఇవ్వాళే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్, ఇండోనేషియా ప్రధాన మంత్రి జోకో విడొడొలను కలుసుకుంటారు. వారిద్దరితో పాటు సింగపూర్ ప్రధానమంత్రి లీ హొసెయిన్‌ను కూడా కలుసుకోవాల్సి ఉంది. ఇది ఇంకా షెడ్యూల్ కాలేదని సమాచారం. ఈ సాయంత్రానికి ప్రధాని టెర్మె డి డయోక్లెజియానో పోడియానికి చేరుకుంటారు.
అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీ20 దేశాధినేతలు, ఇతర అధికారులు, ప్రతినిధులతో కలిసి రాత్రి భోజనం చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలైన తరువాత ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, దాన్ని నివారించడానికి ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు, ఇకపై చేపట్టాల్సిన ప్రణాళికల గురించి ఈ జీ20 సమ్మిట్‌లో ప్రధాని చర్చిస్తారు. తన రోమ్ పర్యటనలో ప్రధాని మోడీ ఇదివరకే ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, ఇతర యూరోపియన్ యూనియన్ లీడర్లతో సమావేశం అయ్యారు. కోవిడ్ 19ను నివారించడానికి భారత్ చేపట్టిన చర్యలపై ఆయా యూరోపియన్ యూనియన్ దేశాధినేతలు ప్రధానిని ప్రశంసించారు. ఇటలీలో స్థిరపడిన ప్రవాస భారతీయులను కూడా ఆయన కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం వరకు మోడీ రోమ్ లో ఉండనున్నారు.