Begin typing your search above and press return to search.

ఆ జాబితాలో అగ్ర‌స్థానంలో మోదీ!

By:  Tupaki Desk   |   3 May 2018 3:33 PM GMT
ఆ జాబితాలో అగ్ర‌స్థానంలో మోదీ!
X
భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. 2014 ఎన్నిల‌కు ముందు మోదీ ...సోష‌ల్ మీడియాను విచ్చ‌ల‌విడిగా వాడుకొని ...త‌న గురించి విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ చేసుకున్నారు. దేశ ప్ర‌ధాని అయిన త‌ర్వాత మోదీని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. తాజాగా, ఫేస్ బుక్ విడుద‌ల చేసిన జాబితాలో మోదీ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచారు. ఫేస్ బుక్ లో ఎక్కువమంది ఫాలో అవుతున్న‌ ప్రపంచ నాయకుడిగా మోడీ రికార్డ్ సృష్టించారు. ఫేస్ బుక్ లో మోదీ....4.32 కోట్లమంది ఫాలోవ‌ర్ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.31 కోట్ల ఫాలోవ‌ర్ల‌తో రెండో స్థానంలో ఉన్నారు. బర్సన్‌ కోన్‌ అండ్‌ వోల్ఫ్‌ (బీసీడబ్ల్యూ) సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది. మొత్తం 650 మంది దేశాధిపతులు, ప్రభుత్వ అధినేతలు, విదేశాంగ మంత్రుల ఫేస్‌బుక్‌ పేజీలను విశ్లేషించిన త‌ర్వాత ఈ జాబితాను వెల్ల‌డించింది.

ఫేస్‌బుక్ లో ప్రపంచ నేతలను అనుసరించే వారి 2018 మార్చి 15వ తేదీ వ‌ర‌కు 30.9 కోట్లుగా ఉంది. వారంతా 2017 జనవరి 1 నుంచి దాదాపు 5లక్షలకు పైగా పోస్టులు చేశారు. ఆ పోస్టుల‌పై 90 కోట్ల సంభాషణలు జరిగాయి. ఐక్య రాజ్య సమితిలో స‌భ్య‌త్వం ఉన్న దేశాల్లో 91 శాతం దేశాలకు అధికారిక ఫేస్‌బుక్ పేజీలున్నాయి. దాంతోపాటు 109 మంది దేశాధిపతులు, 86 మంది ప్రభుత్వాధినేతలు, 72 మంది విదేశాంగ మంత్రులకు ప‌ర్స‌న‌ల్ ఫేస్‌బుక్ పేజీలున్నాయి. గత 14 నెలల్లో ట్రంప్ ఫేస్ బుక్ పేజీ పైనే ఎక్కువ డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. ఆ పేజీలో లైక్‌లు, వ్యాఖ్యలు, షేర్ల సంఖ్య 20 కోట్లకు పైగా ఉండ‌గా....మోడీ పేజీ పైన 11 కోట్లకు పైగా ఉంది. మోదీని 43.2 మిలియన్ల మంది ఫాలో అవుతుండ‌గా.... ట్రంప్ ను 23.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.