Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు దేశ ప్రజలకు మరో టాస్క్ ఇచ్చిన నరేంద్ర మోడీ

By:  Tupaki Desk   |   1 Aug 2022 4:08 AM GMT
ఇన్నాళ్లకు దేశ ప్రజలకు మరో టాస్క్ ఇచ్చిన నరేంద్ర మోడీ
X
దేశ ప్రజల్ని ఎలా డీల్ చేయాలి? వారితో ఇంటరాక్షన్ ఎలా జరపాలన్న దానిపై మిగిలిన దేశ ప్రధానులతో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోడీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఇప్పటివరకు ఎవరూ చెప్పని మాటలు.. చేయని పనులు.. ఇవ్వని టాస్కులు ఇవ్వటం ఆయనకుఅలవాటన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో యావత్ దేశం మొత్తం భయం గుప్పిట్లో గజగజలాడిపోయిన వేళలో.. ప్రజలకు యాక్టివిటీ లేకుండా ఇంటికే పరిమితమయ్యారన్న మాట వినిపిస్తున్న వేళలో.. వారికి గంటలు మోగించాలని చెప్పటం.. దీపాలు వెలిగించాలని చెప్పటం లాంటి టాస్కుల్ని ఇవ్వటం తెలిసిందే.

ప్రధాని నరేంద్రమోడీ నోటి నుంచి టాస్కులు వచ్చినంతనే.. స్పందించే అద్భుత గుణం కూడా దేశ ప్రజల్లో కనిపిస్తూ ఉంటుంది. కరోనా వేళ.. గంటలు కొట్టాలని టైం కూడా చెప్పిన మోడీ మాటలను తూచా తప్పకుండా పాటించటం ద్వారా.. ఆయన మాటనుతామెంత కమిట్ మెంట్ గా తీసుకుంటామన్న విషయం ఈ టాస్కులతో అర్థమైంది. కరోనా వేళ టాస్కులు ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత పెద్దగా ఇవ్వలేదనే చెప్పాలి. మళ్లీ ఇన్నాళ్లకు టాస్కుల్ని ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వినూత్న ప్రకటన చేశారు.

ఇవాల్టి రోజున చిన్నా పెద్దాఅన్న తేడా లేకుండా దేశ ప్రజలందరికి సోషల్ మీడియా.. వాట్సాప్ లు కీలకంగా మారిన వేళ.. వాటి ప్రొఫైల్ పిక్ లుగా జాతీయ జెండాను పెట్టుకోవాలని మోడీ కోరారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోందన్న ఆయన..దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయటం ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు.

ఆగస్టు 2న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగాఆ రోజు నునంచి ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలంటూ ఆయన మానసపుత్రిక అయిన మన్ కీ బాత్ స్పీచ్ లో కోరారు.

తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత దేశ ప్రజలతో తరచూ సంభాషించేందుకు వీలుగా మన్ కీ బాత్ అనే ప్రోగ్రాంను నిర్వహించటం తెలిసిందే. ఇప్పటివరకు 91 సార్లు మన్ కీ బాత్ ప్రోగ్రాంలను నిర్వహించిన ఆయన.. 75ఏళ్ల స్వాతంత్ర్యానికి నిదర్శనంగా 75 రైల్వేస్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టిన వైనాన్ని గుర్తు చేస్తూ.. ఆయా స్టేషన్లను పిల్లలు సందర్శించాలని కోరారు.

75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన.. చారిత్రక ఘట్టానికి సాక్ష్యమిస్తుందన్నారు. అంతేకాదు.. హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న మిజార్ మేళాను వీలైతే సందర్శించాలన్న పిలుపును ఇచ్చిన మోడీ.. యూకేలో బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆటతీరును ప్రదర్శించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మరి.. ప్రధాని మోడీ ఇచ్చిన తాజా టాస్కుకు స్పందన ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.