Begin typing your search above and press return to search.

మోడీనా మజాకా.. ఈసీ లేదు గీసీలేదు..

By:  Tupaki Desk   |   13 April 2019 10:21 AM GMT
మోడీనా మజాకా.. ఈసీ లేదు గీసీలేదు..
X
పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడిని మోడీ తన ఖాతాలో వేసుకున్నాడు. దాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ పదేపదే రెచ్చగొడుతున్నారు. జవాన్ల త్యాగాలను తన విజయంగా చెప్పుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్నికల కమిషన్ మోడీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా మోడీ ఈసీని లెక్కచేయడం లేదు. పట్టించుకోవడం లేదు.. పాకిస్తాన్ పై దాడిని, ఉగ్రవాదంపై విజయాన్ని ప్రచారంలో హోరెత్తిస్తూనే ఉన్నాడు.

కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేస్తున్నా.. ఈసీకి , రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా మోడీ తీరు మారడం లేదు. దేశ భద్రత.. దేశ సైనిక బలగాలు.. ప్రధాన ప్రచారాయుధంగా మోడీ ప్రసంగం తీరు సాగుతోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ‘సైనికులను అవమానించినవారు గంగలోకి దూకి చావాలి’ అంటూ ఘాటుగా విమర్శించారు. అందుకే ప్రతీ సభలోనూ ‘దేశ రక్షణ, బాలాకోట్ దాడి, సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణత్యాగం, సైనిక బలగాల పోరాటపటిమ’లపై స్పందిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఇలా ప్రభుత్వ వ్యతిరేకత తట్టుకునేందుకే మోడీ తన ప్రచార సరళిని మార్చి సైనికుల తుపాకీ మాటున గెలవాలననుకుంటున్నారన్న విమర్శలు చెలరేగాయి. మోడీతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతలు, బీజేపీ నాయక శ్రేణి అంతా ఇదే అజెండాతో ముందుకు సాగుతున్నారు.

కాగా మోడీ తీరుపైన బీజేపీ ప్రచార సరళిపైనా మాజీ సైన్యాధికారులు, వివిధ దళాల్లో పనిచేసిన సైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సైన్యాన్ని, సైన్యం విజయాలను రాజకీయాలకు వాడుకోవడం ఏంటని తప్పుపడుతున్నారు. ఈ మేరకు 150మంది మాజీ సైనికులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇక కాంగ్రెస్ కూడా మోడీ, షాలు , బీజేపీ నేతలు నిస్సిగ్గుగా రాజకీయాల్లోకి భద్రత బలగాలను లాగుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ నేతలు ఇలా ప్రస్తావించడం ఈసీ నోటీసులు కూడా జారీ చేసింది. ఇలా ప్రతీరోజు ప్రచారంలో సర్జికల్ స్ట్రైక్స్ ను రాజకీయం కోసం వాడుకుంటూ ఎన్నికల చరిత్రలోనే మోడీ సైనికుల త్యాగాలతో గెలవాలని చూస్తున్నాడు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.