Begin typing your search above and press return to search.
మోదీ.. మరో మన్మోహనా!?
By: Tupaki Desk | 24 Jun 2015 5:30 PM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో మన్మోహన్ సింగ్‌లా మారతారా!? తెలంగాణ వాదుల ఎదురు దాడికి, బ్లాక్ మెయిలింగ్‌కు తలగ్గుతారా? సెక్షన్ 8 అమలు విషయంలో వెనక్కిపోతారా? తెలంగాణలో పార్టీ ప్రయోజనాల కోసం సీమాంధ్రుల ప్రయోజనాలను తాకట్టు పెడతారా? ఇప్పుడు సీమాంధ్రుల మనసుల్లో మెదులుతున్న ఆందోళనలివి. సీమాంధ్రలోని వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు కూడా వ్యక్తం చేస్తున్న ఆందోళనలివి. ఏపీ జర్నలిస్టు ఫోరం సమావేశంలో కూడా ఇటువంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయి.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్ 8ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని సీమాంధ్రులు గుర్తు చేస్తున్నారు. కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసినా ఆ శాఖ అధికారులు కానీ మంత్రి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ శాఖ కార్యదర్శి గోయల్ హైదరాబాద్‌కు వస్తారని చెప్పినా రాలేదు. దీనికితోడు అటార్నీ జనరల్ గవర్నర్‌కు సూచన చేశారు తప్పితే కేంద్ర హోం శాఖ నుంచి ఎటువంటి ఆదేశాలూ రాలేదు.
ఇప్పుడు తెలంగాణలోని బీజేపీ నాయకులు సెక్షన్ 8కి అసలు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. దీనికితోడు టీఆర్‌ఎస్‌కు ఆ పార్టీ నేతలు మద్దతు ఇస్తున్నారు కూడా. తాజాగా సెక్షన్ 8ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తామని కేసీఆర్ ప్రకటించడం.. ఉద్యోగ సంఘాలు దీనిపై మాట్లాడుతుండడాన్ని సీమాంధ్ర పార్టీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ ఒత్తిళ్లకు తలగ్గి మోదీ కూడా మన్మోహన్ తరహాలో చట్టం నుంచి వెనక్కి వెళతారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే బీజేపీపై తీవ్రస్థాయిలో పోరాటం చేయాలని సీమాంధ్రలోని విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాలు ఇప్పటికే నిర్ణయించాయి.