Begin typing your search above and press return to search.

ఉరుము ఉరిమి మోడీ పత్రికలపై పడ్డాడు

By:  Tupaki Desk   |   26 Aug 2019 5:49 AM GMT
ఉరుము ఉరిమి మోడీ పత్రికలపై పడ్డాడు
X
జీఎస్టీ - ఐటీ - ఈడీ ఇలా కీలక పన్నులు బాదే సంస్థలను ప్రక్షాళన చేసిన ప్రధాని మోడీజీ పత్రికలపై గుదిబండ మోపారు. విదేశాల నుంచి పేపర్ దిగుమతి చేసుకునే పత్రికలకు షాకిచ్చారు. ఏకంగా పేపర్ దిగుమతులపై 10శాతం అదనంగా పన్ను వేసేశారు. దీంతో పత్రికలకు పెను భారమైంది. మీడియా కింగ్ ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు లాంటి దిగ్గజాలే ఇప్పుడు పత్రికల సైజును తగ్గించివేశారంటే ప్రస్తుతం పత్రికల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా మోడీ దేశంలోని అన్ని పత్రికలు దిగుమతి చేసుకునే పేపర్ బండిళ్లపై 10శాతం అదనంగా పన్ను విధించారు. మన దేశానికి ఎక్కువగా కెనడా - రష్యా నుంచి షిప్పుల్లో ఈ పేపర్ బండిల్స్ వస్తాయి. ఇప్పుడు పన్నుభారంతో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న ఈనాడు వంటి పత్రికలపై పెనుభారం పడింది. దీంతో రామోజీ రావు అండ్ టీం వెంటనే ఆ నష్టనివారణ చర్యలు చేపట్టింది.

జిల్లాలకు ఇచ్చే టాబ్లాయిడ్ పత్రికలను 20 పేజీల నుంచి 16కు తగ్గించేశారు. ఇక మధ్యపేజీలను ఏ జిల్లాకు ఆ జిల్లా ఎత్తివేసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే కామన్ పేజీని చేశారు. నియోజకవర్గాల జోన్లను తగ్గించేశారు. అంతిమంగా నష్టాన్ని పేపర్ ను తక్కువ చేసి ఈనాడు కంట్రోల్ చేసుకుంది.

ఇప్పుడు ఈనాడు బాటలోనే ఆంధ్రజ్యోతి - సాక్షి పత్రికలు కూడా 20 పేజీల జిల్లా సంచికను 16కు పెంచడానికి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి సమాయత్తమవుతున్నాయి.

ఇలా మోడీ కొట్టిన దెబ్బ ముందుగా తెలుగు పత్రికలపై పడింది. దేశంలోని పత్రికలు కూడా ఖర్చులు తగ్గించుకునేందుకు రెడీ అయ్యాయట..