Begin typing your search above and press return to search.

బిజెపి హిందీ రాష్ట్రాల పార్టీయేనా.. మరో సారి రుజవైందా..

By:  Tupaki Desk   |   31 May 2019 2:30 PM GMT
బిజెపి హిందీ రాష్ట్రాల పార్టీయేనా.. మరో సారి రుజవైందా..
X
అఖండ భారత్.. మాకు దేశమంతా ఒక్కటే అంటూ మోడీ - అమిత్ షా విసృత ప్రచారం చేశారు.. ఎందుకంటే ముందు నుంచి బిజెపికి హిందీ రాష్ట్రాల పార్టీగా పేరుంది. ఆ పార్టీ ప్రస్తానం కూడా హిందీ రాష్ట్రాల నుంచే ప్రారంభమైంది.. గత ఎన్నికల్లోనూ ఉత్తర - పశ్చిమ రాష్ట్రాల్లోనే ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది.. ఈ సారి అయితే ఇక ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీకి తిరుగేలేకుండా పోయింది... అయితే దక్షిణాదిలో కర్నాటక మినహా మిగతా రాష్ట్రాల్లో ఎదగలేకపోతున్నామనే భావన ఆ పార్టీకి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తోంది.. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల నేఫథ్యంలో మోడీ సర్కార్ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందంటూ దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులూ ప్రత్యేక సమావేశమయ్యారు గతంలో..

అయితే ఇది దుష్ప్రచారమంటూ దక్షిణాది సభల్లో మోడీ - అమిత్ షా ఏకరవు పెట్టారు.. కానీ క్యాబినెట్ విస్తరణలో తాజా కేటాయింపులు చూస్తే మాది హిందీ పార్టీయే అని మరో సారి ఆ పార్టీ నిరూపించుకున్నట్లైంది.. కర్నాటకలో 28 స్థానాలకు గాను 26 దక్కాయి కాబట్టి నలుగురి క్యాబినెట్ లో చోటు కల్పించారు.. ఇక కేసీఆర్ హవా - ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ లతో ఎదురైన త్రిముఖ పోటీ లో నిలిచి 4 స్థానాలతో ఘన విజయం సాధించిన తెలంగాణలో కేవలం సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి ఒక్కడికే మంత్రి పదవి ఇవ్వడం అందులోనూ ఏ అధికారాలు లేని హోం శాఖ సహాయ మంత్రి పదవి ఇవ్వడం దక్షిణాది వివక్ష అనే విమర్శ వినిపిస్తోంది.. తెలంగాణలో ఎదుగుదామంటున్న ఆ పార్టీ కిషన్ రెడ్డిని కేవలం సహాయమంత్రి పదవికే పరిమితం చేయడం - మరోకరికి ఛాన్స్ ఇవ్వకపోవడంపై పెదవి విరుపు వినిపిస్తోంది...

అలాగే తమిళనాడు లో బిజెపి కి సీట్లు రాకపోయినా.. మిత్ర పక్షం అన్నాడీఎంకే ఒక సీటు దక్కించుకున్నా ఛాన్స్ దక్కలేదు.. అలాగే కేరళ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మురళీధరన్ కు కూడా సహాయ మంత్రి పదవే కట్టబెట్టారు.. అంటె ఎన్నికైన సభ్యుల్లో క్యాబినెట్ ర్యాంకు దక్కింది దక్షిణాధి నుంచి ఇద్దరికే .. కర్నాటక నుంచి గెలిచిన సదానంద గౌడ - ప్రహ్లాద్ జోషి కి క్యాబినెట్ లో చోటు దక్కింది.. కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న నిర్మలా సీతారామన్ కు - తమిళనాడు కు చెందిన మాజీ విదేశాంగ కార్యదర్శి జై శంకర్ కు అవకాశం కల్పించినా.. వీరిద్దరిని దక్షిణాది కోటా కంటే అవసరాలు - అనుభవం నేపథ్యంలో పెద్ద పీట వేశారనేది వాస్తవం.. ఇలా దక్షిణాది సొంత పార్టీ నేతలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవటాన్ని ఏమనాలి...