Begin typing your search above and press return to search.
వారణాసిలో మోడీని భయపెడుతున్న ఆ ప్రచారం!
By: Tupaki Desk | 28 April 2019 1:30 AM GMTమన రాజకీయ నేతలు తమ ప్రత్యర్థుల విషయంలో రకరకాల ప్రచారాలను చేయడంలో తలపండిపోయారు. ఈ ప్రచారాల్లో వీళ్లు తమ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం సంగతెలా ఉన్నా.. ప్రజలను వెర్రివాళ్లుగా చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రస్తుతం యూపీలోని వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో అలాంటి ప్రచారమే ఒకటి సాగుతూ ఉందట.
అక్కడ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో మోడీ మీద ప్రత్యర్థులు ఒక విచిత్రమైన ప్రచారాన్ని చేస్తున్నారట. అదేమిటంటే.. ‘ఇప్పటికే మోడీ గెలిచేశారు..’ అనేది ఆ ప్రచారం సారాంశం.
'మీరు ఇక మోడీకి ఓటు వేయనక్కర్లేదు.. మోడీ ఇప్పటికే గెలిచేశారు..'అంటూ మోడీ మీద ప్రత్యర్థులు ఒక ప్రచారం మొదలు పెట్టారట. అసలే జనాలు అమాయకులు. అంతగా విద్యావంతులు కూడా ఉండరు. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రచారం జోరుగా సాగుతోందట.
ఇంకా వారణాసికి పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ప్రత్యర్థులు మోడీకి ఓటు వేయొద్దు అని కాకుండా - 'మోడీ ఆల్రెడీ గెలిచేశారు.. ఇక మీరు ఓటు వేయనక్కర్లేదు..' అంటూ ప్రచారం చేస్తున్నారట. చదువుకున్న వాళ్లు - విద్యావంతులు.. ఫేస్ బుక్ లో నకిలీ వార్తలను ప్రచారం చేసే రోజులు ఇవి. అలాంటిది వారణాసిలో అమాయక నిరక్షరాస్యులు ఇలాంటి ప్రచారాలను నమ్మేసినా నమ్మొచ్చు. ఈ విషయంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందట. 'ఇంకా మోడీ గెలవలేదు.. ఆయనకు ఓటేసి గెలిపించండి..'అంటూ బీజేపీ ప్రచారం మొదలుపెట్టినట్టుగా సమాచారం.