Begin typing your search above and press return to search.
మోడీ ఫోకస్ పెరిగే కొద్దీ.. భయాలున్నట్లే లెక్క!
By: Tupaki Desk | 8 Oct 2015 3:50 AM GMTకొన్ని రాష్ట్రాల్లో అయితే.. శాసనసభకు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న అగ్ర నాయకులు ఆ ఎన్నికలవైపు కనీసం చూడను కూడా చూడరు. అక్కడ రాబోయే ఫలితాల మీద వారికి ముందే ఒక క్లారిటీ ఉంటుంది. అక్కడ తమ పార్టీకి ఉండే ఆదరణ గురించి, లేదా, తాము చేసే హామీలను ప్రజలు ఎంత నమ్ముతున్నారనే విషయం గురించి.. వారికి ఒక స్పష్టత ఉంటుంది.కానీ... ప్రధాని నరేంద్రమోడీ బీహార్ లో కనబరుస్తున్న ఆత్రుతను గమనిస్తున్న కొద్దీ.. అక్కడ విజయావకాశాలపై ఎన్డీయే కూటమిలో చాలా భయాలు తిష్టవేసి ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ప్రధాని స్థాయిలో ఉండే వ్యక్తి ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గతంలో మహా అయితే ఒకటి రెండు రోజులను మాత్రం గరిష్టంగా ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కేటాయించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీహార్ లో ఎన్నికలు పలు విడతలుగా జరుగుతూ ఉండగా.. ప్రతి విడత ఎన్నికలకు ముందుగా కనీసం రెండు రోజులను ప్రధాని మోడీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి.
బీహార్ మీద నరేంద్రమోడీ ఎంత ఎక్కువగా దృష్టి పెడుతోంటే.. ఆ రాష్ట్రంలో ఎన్నికల విషయంలో ఆ పార్టీ అంతగా భయపడుతున్నట్లుగా అర్థమైపోతోంది. నితీశ్ కుమార్ సీఎంగా సాగించిన పరిపాలన మీద రాష్ట్ర ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది. దాన్ని చెరిపివేయడం మోడీ కూటమికి అంత ఈజీగా అయ్యే పనిలాగా కనిపించడం లేదు. అందుకే మోడీ బ్యాచ్ బీహార్ ఎన్నికల గురించి ఎక్కువగా భయపడుతున్నట్లు కనిపిస్తోంది.