Begin typing your search above and press return to search.
ముందస్తు కాదు.. తథాస్తు ఎన్నికలేనట
By: Tupaki Desk | 3 Feb 2018 4:40 PM GMTకేంద్రంలో పాలన సాగిస్తున్న బీజేపీ మైండ్ సెట్ ను ఫిబ్రవరి 1వ తేదీ పూర్తిగా మార్చేసింది. రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలు రావడం.. రెండు పార్లమెంటు స్థానాలు - ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ పోగొట్టుకోవడంతో పాటు ఎన్నికల ముందు తురుపు ముక్క అవుతుందనుకున్న బడ్జెట్ కాస్త భారీస్థాయిలో విమర్శలపాలు కావడంతో ప్రధాని మోదీ - బీజేపీ పెద్దలు తొందరపడడం మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం వ్యతిరేకతను పసిగట్టిన వారు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ ఆలోచనను మరింత ముందుకు నెట్టి వీలైనంత వేగంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లేనిపక్షంలో తీవ్ర నష్టం తప్పదని భావిస్తున్నారు.
రాజస్థాన్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడానికి బీజేపీ పట్ల వ్యతిరేకతే కారణమని పార్టీ పెద్దలు భావించినట్లుగా తెలుస్తోంది. అయితే... ఆ ఆ రాష్ఱ్ట బీజేపీపై వ్యతిరేకత అనే వాదన కూడా ఉన్నప్పటికీ, పద్మావతి సినిమా నేపథ్యంలో ఓవరాల్ గా బీజేపీని రాజ్ పుట్ లు వ్యతిరేకించారని విశ్లేషకులు అంటున్నారు. ఆ వర్గం బీజేపీకి దూరమైనట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. బీజేపీపై పెరుగుతున్న ఈ వ్యతిరేకత మరింత ముదరక ముందే ఈ ఏడాదే వీలైనంత తొందర్లో రాజస్థాన్ - మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లడం మంచిదని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్లు తెల్సింది.
'
పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పట్టును కోల్పోతుందని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి తెలియజేయడంతో బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మరోవైపు దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ లో రైతులకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే... ఈ గ్రామీణ భారతానికి, రైతులకు బడ్జెట్ ప్రయోజనాలు దక్కేంత వరకు వేచిచూస్తే ఆలోగా మిగతా వర్గాలు, ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందని.. కాబట్టి వెంటనే వెళ్లడం మంచిదని భావిస్తున్నారట.