Begin typing your search above and press return to search.

గాంధీ కల.. సీఏఏపై మోడీ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   12 Jan 2020 7:22 AM GMT
గాంధీ కల.. సీఏఏపై మోడీ సంచలన వ్యాఖ్యలు
X
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై మరోసారి ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్న మోడీ అక్కడి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సీఏఏ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి దీనిపై దేశంలోని ప్రజలకు స్పష్టతనిచ్చారు.

పౌరసత్వ సవరణ చట్టం అనేది ఏ ఒక్క పౌరసత్వాన్ని లాగేసుకోవడం కాదని.. పొరుగు దేశాల్లో వివక్ష, హింసకు గురై ఇక్కడికి వలసొచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించడమే దాని ఉద్దేశం అని అన్నారు.

బెంగాల్ లో సీఎం మమత సహా పెద్ద ఎత్తున సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

యువత, ప్రజలు సీఏఏ దేశానికి ఎందుకంత ముఖ్యమో తెలసుకోవాలని.. దీనిపై దుష్ప్రచారాలు, అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయన్నారు. రాజ్యాంగమే వేరే దేశం నుంచి వచ్చిన వారు ఎవరైనా ఇక్కడ పౌరులు కావచ్చని తెలిపిందని.. అందుకే ఇతర దేశాల్లో అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వారికి పౌరసత్వం కల్పించామన్నారు. పాకిస్తాన్ సహా పొరుగుదేశాల్లో హింసను అనుభవిస్తూ ఇక్కడికి వలసవచ్చిన వారికి మానవత్వ ప్రాతిపాదికన దేశ పౌరసత్వం కల్పించాలని మహాత్మాగాంధీ చెప్పారని.. ఆయన కలలను తాము నెరవేరుస్తున్నామని మోడీ తెలిపారు. పౌరసత్వంపై కొందరు పొలిటికల్ గేమ్స్ ఆడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మోడీ విమర్శించారు.