Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ కి తీవ్ర అవమానం..అసలేమైందంటే ?

By:  Tupaki Desk   |   27 Jan 2020 5:30 PM GMT
ప్రధాని మోడీ కి తీవ్ర అవమానం..అసలేమైందంటే ?
X
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ - ఎన్ ఆర్ సీ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొందరు మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్దిస్తుంటే ..మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అనేక సమస్యలు ఎదురౌతున్నాయని ఆరోపిస్తూ కర్ణాటకలో విద్యార్థులు ఓ నాటకం ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సీఏఏ - ఎన్ ఆర్ సీ కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని విద్యాసంస్థ నిర్వహకులు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన నాటకంలో ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారని ఆరోపిస్తు ఆ విద్యాసంస్థ నిర్వహకుల మీద దేశద్రోహం కేసు నమోదైయ్యింది.

పూర్తి వివరాలు చూస్తే ... కర్ణాటకలోని బీదర్ లో శాహిన్ శిక్షణ సంస్థ నిర్వహిస్తున్నారు. శాహిన్ శిక్షణ సంస్థలో సీఏఏ - ఎన్ ఆర్ సీ కి వ్యతిరేకంగా కొన్ని నాటకాలు ప్రదర్శిస్తూ ..దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రచారం చేస్తున్నారు. తాజాగా అందులో భాగంగానే ఒక స్కూల్ లో నాటక ప్రదర్శన చేసారు. విద్యార్థులు ప్రదర్శించిన నాటకంలో ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ క్యారెక్టర్ వేశారు. గతంలో టీ అమ్ముకున్న వ్యక్తి నేడు ప్రజల మీద బలవంతంగా సీఏఏ - ఎన్ ఆర్ సీ బిల్లులు రుద్దారని - నేడు ఆయన మిమ్మల్ని విలువైన దృవీకరణ పత్రాలు చూపించాలని ఆదేశాలు జారీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచే విధంగా నాటకం ప్రదర్శించారు.

ప్రధాని నరేంద్ర మోదీ గతంలో టీ అమ్ముకున్నారని - నేడు ప్రజల మీద పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపిస్తూ ప్రదర్శించిన నాటకం వేసిన సమయంలో స్థానిక ప్రజలు - టీచర్లు - విద్యార్థుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున్న చప్పట్లు కొట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆయనను కించపరిచే విధంగా నాటకం వేసి దానిని సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ విద్యాసంస్థ మీద కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త నీలేష్ ఫిర్యాదు మేరకు విద్యాసంస్థల నిర్వహకుడు డాక్టర్ అబ్దుల్ ఖదీర్ మీద దేశద్రోహం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బీదర్ న్యూ టౌన్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారం పై బీదర్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి - బీజేపీ సీనియర్ నాయకుడు ప్రభు చౌహాన్ సైతం సీరియస్ అయ్యారు. ప్రధాని మోడీని కించపరిచే విధంగా నాటకం ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చిన విద్యాసంస్థల నిర్వహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకి తెలిపారు.