Begin typing your search above and press return to search.
దేశం భగ్గుమంటుంటే..మోదీ ఏంత కూల్ గా స్పందిచారంటే..!
By: Tupaki Desk | 15 Dec 2019 4:44 PM GMTకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం రగిలించిన వివాదం కొనసాగుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. పశ్చిమబెంగాల్ లో సైతం పెద్ద ఎత్తున్నే ఆందోళనలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు వాహనాలు దగ్ధం చేశారు. అయితే, ఇంత కలకలం రేపుతున్న ఉదంతంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూల్ గా స్పందించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో ఏమాత్రం తప్పులేదని...ఈ నిరసనల వెనుక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు.
ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పౌరసత్వ సవరణ చట్టం వందకు వందశాతం సరైనదేనని ప్రకటించారు. పొరుగు దేశాల నుండి భారత్‌కు వచ్చిన వారు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారని అనేక ఇబ్బందులు పడుతున్న హిందువుల రక్షణ కోసమే బిల్లు తీసుకువచ్చామని మోదీ వెల్లడించారు. పాకిస్తాన్ - బంగ్లాదేశ్ - ఆఫ్గానిస్తాన్ దేశాల నుండి వచ్చిన శరణార్థులకు ఈ బిల్లు ఎంతో మేలు చేస్తుందన్నారు. అయితే, ఈశాన్య రాష్ట్రాలే కాకుండా - వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ...చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక ఉంది ప్రతిపక్షాలేనని ప్రధాని ఆరోపించారు. అందోళనల్లో నిరసనకారులు వేసుకున్న డ్రస్సులను బట్టే.. ప్రతిపక్షాలు ప్రేరిపించిన వ్యక్తులను స్పష్టమవుతోందని మోదీ వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా, ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ - తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వీరితోపాటు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ - పీస్ పార్టీ - రిహాయ్ మంచ్ - సిటిజన్స్ అగెనెస్ట్ హేట్ స్వచ్ఛంద సంస్థలు - న్యాయవాది ఎంఎల్ శర్మ - పలువురు లా స్టూడెంట్స్ సైతం పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు కొత్త వివాదం ముందుకొచ్చింది. క్యాబ్ ను అమలు చేయబోమని పలు రాష్ర్టాలు ప్రకటిస్తుండగా.. ఈ అంశం కేంద్రం జాబితాలో ఉన్నదని - తిరస్కరించే హక్కు రాష్ర్టాలకు లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్తోంది. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలుచోట్ల నిరసన ర్యాలీలు నిర్వహించారు. అయితే కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాలు తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని - తిరస్కరించే అధికారం వాటికి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఏడో షెడ్యూల్ లోని కేంద్ర జాబితాలో చేర్చిందని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు.