Begin typing your search above and press return to search.
సీనియర్లకు మరో షాకివ్వనున్న మోడీ
By: Tupaki Desk | 16 July 2016 7:04 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టైలే వేరు. దూకుడుగా నిర్ణయం తీసుకోవడంలో ఎలా వ్యవహరిస్తారో...వాటిని సమీక్షించుకోవడానికి సైతం ఆయన అంతే ప్రాధాన్యం ఇస్తారు. తాజాగా కేంద్ర సహాయ మంత్రుల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకోనున్నారట. సీనియర్లకు మాత్రమే ప్రాధాన్యం దక్కే నిర్ణయాన్ని పక్కన పెట్టి నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చేలా జూనియర్లకు అవకాశం ఇవ్వనుననారు.
సాధారణంగా కేంద్ర కేబినెట్ లోని సహాయ మంత్రుల పనేమిటంటే ఆయా మంత్రిత్వశాఖల రోజువారి వ్యవహారాలు చూడటం - సదరు శాఖకు సంబంధించి పార్లమెంటులో సభ్యులు వేసే ప్రశ్నలకు బదులివ్వడమే. అంతేకానీ ఆయా శాఖల విధాన నిర్ణయాల్లో వీరికి ఏమాత్రం పాత్ర ఉండదు. దానికి తోడు - సహాయ మంత్రులను ఐఏఎస్ అధికారులు సహా ఇతర సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీనితో సహాయ మంత్రులంతా పేరుకు మాత్రమే మంత్రులుగా మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితి త్వరలో మారనుంది. ప్రధాని నరేంద్ర మోడీ తన రెండేళ్ల పాలనపై జరిపిన సమగ్ర విశ్లేషణలో సహాయ మంత్రుల దీనావస్థ ఆయన దృఫ్టికి వచ్చింది. అంతే కాకుండా ఐదేళ్ల పాటు సహాయ మంత్రులుగా ఉన్న వారి పని తీరులో పెద్దగా మార్పేమీ ఉండకపోవడం ఆయనకు కనిపించలేదట. దీనితో వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు మోడీ నడుం బిగించారు. ఇందులో భాగంగా అన్ని విధాన నిర్ణయాల్లో సహాయ మంత్రులకు కూడా తప్పనిసరిగా అవకాశం కల్పించాలని అన్ని మంత్రి త్వశాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సహాయ మంత్రులతో చర్చలు జరిపి, ఆయా నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను కేబినెట్ భేటీ ముందు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పరిణామం సీనియర్లకు షాక్ గా - జూనియర్లకు వరంగా మారనుందని అంటున్నారు.