Begin typing your search above and press return to search.
మీడియాను ఓపెన్ గానే హెల్ప్ అడిగేసిన మోడీ
By: Tupaki Desk | 4 Nov 2016 4:17 AM GMTవిషయాల్ని వివాదాస్పదం కాకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో ప్రధాని మోడీ తీరే వేరు. తనకు నచ్చిన అంశాల మీద క్షణాల్లో స్పందించటం.. తాను కోరుకున్నది జరగకుంటే.. వ్యక్తిగత స్థాయిలో సైతం ప్రయత్నించే తత్వం కనిపిస్తుంది. తాను ప్రధానమంత్రి అయి..సలహాలు.. సూచనలు అడగటం ఏమిటన్న ‘ఇగో’ను ప్రదర్శించరు. అలా అని మోడీకి ఇగో లేదనుకుంటే తప్పులో కాలేసినట్లే సుమా.
తాను అనుకున్నది సాధించేందుకు ఎంతవరకైనా సరే వెళ్లే మోడీ తాజాగా ఆయన వ్యవహారశైలి కాసింత ఆశ్చర్యంగా అనిపించేలా కనిపిస్తుంది. మిగిలిన ప్రధానమంత్రులకు తనకు మధ్యనున్న తేడాను ఆయన చెప్పకనే చెప్పేశారు. దేశంలో జరిగే ఎన్నికల విధానంపై మోడీకి చాలానే అసంతృప్తి ఉంది. ఆయన కలేమిటంటే.. దేశంలో లోక్ సభకు.. అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్నది ఆయన కోరిక. అదే జరిగితే.. ప్రతి సంవత్సరం మూడు నెలలకు.. ఆర్నెల్లకోమారు ఎన్నికలు రావటం.. అవి కేంద్రంలోని సర్కారు పని తీరుకు కొలమానంగా మారటం.. ఎన్నికల వేళ.. తాము చేయాలనుకున్న పనుల్ని పునరాలోచించుకొని.. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించే పరిస్థితి.
ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు ప్రధాని మోడీ భారీ ప్లాన్ వేశారు. అదేమిటంటే.. లోక్ సభకు జరిగే ఎన్నికల సమయంలోనే.. అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది ఆయన కోరిక. అదే జరిగితే.. కేంద్రంలో సర్కారుతో పాటు.. రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్తగా కొలువు తీరుతాయి. అప్పుడు ఐదేళ్ల వరకూ మధ్యలో ఎన్నికల రాజకీయం అంటూ వెనకడుగు వేయకుండా.. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఏమేం చేయాలో దాన్ని పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. దీనికి తోడు.. కేంద్రం.. రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగిన పక్షంలో లోక్ సభలోనూ..రాజ్యసభలోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే.. తన కోరికను తాజాగా మీడియా ముందు బయటపెట్టారు మోడీ.
మీడియా ప్రతినిధులకు దీపావళి తర్వాత బీజేపీ ఇచ్చే విందులో తన మనసులోని మాటను బయటపెట్టారు మోడీ. అయితే.. తన ఆలోచన దేశ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయటంతో పాటు.. పలు రాజకీయ పక్షాలు ఇలాంటి వాటికి నో అంటే నో అనేయటం ఖాయం. అందుకే.. తన మాట వివాదం కాకూడదన్న ఆలోచనతో మీడియాకు తన విధానాన్ని స్పష్టం చేస్తూ.. తాను చెప్పిందంతా తన ఆలోచన మాత్రమేనని.. దీనికి కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని.. మీడియానే చొరవ తీసుకొని ఈ విధానం మంచిదా? కాదా? అన్న అంశం మీద లోతైన చర్చ జరపాలని.. అర్థవంతమైన చర్చ ద్వారా దీనికో పరిష్కార మార్గం కనుగొనాలన్నారు.
ఒకవేళ తన ప్రతిపాదనకు సానుకూల స్పందన వస్తే దీనిపై మరింత ఆలోచించొచ్చని.. ఒకవేళ ప్రతికూల అభిప్రాయాలు బయటకు వస్తే.. ఈ చర్చను అక్కడితో ఆపేయొచ్చని వ్యాఖ్యానించారు. తన మాటలతో లేనిపోని రాజకీయ అలజడి రేగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మోడీ మాటల్ని చూస్తే ఇట్టే అర్థమవుతాయి. విందుకు పిలిచిన మోడీ.. మీడియా ప్రతినిధులకు పే..ద్ద పనే అప్పగించారని చెప్పాలి. మరి.. ఈ విషయంపై మీడియా తన చర్చను షురూ చేస్తుందా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/