Begin typing your search above and press return to search.
తెలంగాణ బీజేపీకి మోడీ ఇచ్చిన ఆక్సిజన్ ఇదే..!
By: Tupaki Desk | 8 Aug 2016 11:43 AM GMTతెలంగాణ కాషాయ దళం ఇప్పడు మంచి జోష్ మీదుంది! నేతల మొదలు కార్యకర్తల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దీనంతటికీ ప్రధాని మోడీయే కారణమంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు ఒకింత నిర్వేదంతో ఉన్న తెలంగాణ బీజేపీకి మోడీ కొత్త ఊపిరులూదారని వారు చెబుతున్నారు. ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీ.. కేవలం ఆ ఒక్క కార్యక్రమానికి మాత్రమే పరిమితమవుతారని, మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారని ప్రధాని మోడీ కార్యాలయం గతంలోనే షెడ్యూల్ వెల్లడించింది. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కసారిగా హతాశులయ్యారు.
తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న ప్రధాని మోడీ తొలి పర్యటన కావడం, మోడీ రాకకోసం కార్యకర్తలు ఎదురు చూస్తుండడం, పార్టీకి దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్న తరుణంలో ప్రధాని కార్యాలయ ప్రకటన వారిని నివ్వెర పరిచింది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రధానితో స్వయంగా మాట్లాడి.. తెలంగాణ పర్యటనలో బీజేపీకి కూడా సమయం కేటాయించేలా ఆయనను ఒప్పించగలిగారు. ఈ నేపథ్యంలోనే ఎల్ బీ స్టేడియంలో భారీ సభకు ఆదివారం మోడీ హాజరై.. తెలంగాణ బీజేపీ నేతలకు ప్రజల్లోకి ఎలా వెళ్లాలో పరోక్షంగా దిశానిర్దేశం చేశారు.
ఆదివారంతో తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలైందని మోడీ చెప్పారు. తన సభకు వేలసంఖ్యలో వచ్చినవారు ఓటర్లు మాత్రమే కాదని - బీజేపీ జెండా మోసే కార్యకర్తలని - మిమ్మల్ని చూస్తుంటే నాకు తెలంగాణ భవిష్యత్ కనిపిస్తోందని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నమాటలతో ఒక్కసారిగా సభ చప్పట్లతో మార్మోగిపోయింది. అదేసమయంలో తెలంగాణ విమోచన దినాన్ని ప్రస్తావించిన మోడీ.. సెప్టెంబరు 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంటే, పరోక్షంగా తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు విమోచన దినాన్ని నిర్వహించాలని బీజేపీకి దిశానిర్దేశం చేశారు. ఇక - ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించాలని, తిరంగా యాత్ర చేయాలని ఆయన సూచించారు.
దీనిద్వారా యువతను బీజేపీ వైపు మళ్లించాలనేది మోడీ యోచనగా భావించవచ్చు. ముఖ్యంగా ఆయన చేసిన సూచనల్లో విమోచన దినం తెలంగాణ బీజేపీకి ప్లస్ పాయింట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తెలంగాణలో సగానికి పైగా అసెంబ్లీ సీట్లలో పాగా వేయాలని బీజేపీ నేతలు ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ పరోక్షంగా చేసిన దిశా నిర్దేశం వారిలో కొత్త ఆక్సిజన్ నింపినట్లయింది. మరి భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాలి. ఏదేమైనా మోడీ పార్టీ సభకు వచ్చి తమలో జోష్ నింపి...టీ బీజేపీకి బంపర్ గిఫ్ట్ ఇచ్చారని పార్టీ నేతలు ఫుల్ ఖుషీ ఫీలవుతున్నారు.