Begin typing your search above and press return to search.
ఏం చెప్పావు మోడీ జీ
By: Tupaki Desk | 10 April 2015 6:57 AM GMTప్రధానమంత్రి నరేంద్రమోడీ స్టైల్ మార్చినట్లు కనిపిస్తోంది. తన ప్రభుత్వంపై, తనపై వస్తున్న వచ్చిన, వస్తున్న విమర్శలను వరుసగా ఒక్కోటి పరిష్కరించుకుంటున్నారు. ఎంపీలు పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ ఇప్పటికే చెప్పేసిన మోడీ..అనంతరం ఢిల్లీ ఫలితాలపై నోరువిప్పారు. తాజాగా కార్పొరేట్్ అనుకూల మోడీ అనే అభిప్రాయాలపైనా స్పందించారు. రాజకీయ వర్గాలు కార్పొరేటు అనుకూలుడని చేస్తున్న విమర్శలు, పాలసీలు సరిగా లేవని పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మోడీ ఇద్దరికీ ఒకేసారి రియాక్షన్ ఇచ్చారు.
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకైనా.. సామాన్య ప్రజానీకానికైనా ప్రభుత్వ విధానాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఏ కొంత మందికో మినహాయింపులు ఉండబోవని కుండబద్దలు కొట్టారు. పరిశ్రమ వర్గాలకు ప్రభుత్వ విధానాలు నచ్చితే ముందుకు రావొచ్చని లేకపోతే ఉన్న చోటే ఉండి తమ పని తాము చేసుకోవచ్చని తేల్చి చెప్పారు. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, సామాన్యుల శ్రేయస్సు కోసమే పనిచేస్తోందని హిందుస్తాన్ టైమ్స్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని చెప్పారు.
అయితే మోడీ మనస్పూర్తిగా కార్పొరేట్లకు వ్యతిరేకంగా మాట్లాడరు అనే ఆరోపణలు, భూ సేకరణ బిల్లుపై చుట్టుముడుతున్న వ్యాఖ్యాల నేపథ్యంలో ఈ విధంగా కామెంట్లు చేశారా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.