Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారా?

By:  Tupaki Desk   |   24 April 2020 5:30 PM GMT
ప్రధాని మోడీ తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారా?
X
ఇప్పటివరకూ దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారికి మోడీకి చాలానే తేడా ఉంది. ఎప్పుడేం చేయాలో.. ఏ విషయాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికి తెలీదని చెప్పాలి. సంక్షోభ సమయాల్లో భారీ మైలేజీ పొందటమే కాదు.. చిన్న చిన్న పనులతో పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోవటంలో ఆయన తర్వాతే ఎవరైనా. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న ఆయన.. తాజాగా చేసిన ఫోన్ కాల్ ఒకటి పెద్ద వార్తగా మారటమే కాదు.. ప్రధాని మోడీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేసింది.

కరోనా వేళ.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా దేశంలోని వివిధ రంగాలకు చెందిన వారితో నిరంతరం మాట్లాడుతున్న ప్రధాని మోడీ.. తాజాగా మాత్రం తన పాత స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడారు. కరోనా కారణంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఆయన.. దాని నుంచి బయటపడేందుకు బీజేపీ సీనియర్ నేత.. మోడీకి ఒకప్పుడు మిత్రుడిగా ఉన్న మోహన్ లాల్ బౌతియాల్ కు ఫోన్ చేశారు.

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందన్న మాటకు మోహన్ లాల్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. ప్రధాని హోదాలోకి వెళ్లిన తర్వాత మోడీ ఇప్పటివరకూ ఆయనతో మాట్లాడింది లేదు. అలాంటిది అకస్మాత్తుగా ఫోన్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. అయితే.. కరోనా వేళలో తీవ్రమైన ఒత్తిడితో ఉన్న మోడీ.. దాని నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఫోన్ చేసినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ లోని స్వగ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో మోహన్ లాల్ ఉన్నారు.

దాదాపు మూడు నిమిషాల పాటు సాగిన వారి సంభాషణలో ఇరువురు యోగక్షేమాలతో వారి సంభాషణ సాగింది. ఈ సందర్భంగా వారు బీజేపీలోకలిసి పని చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు పాత మిత్రుడితో మాట్లాడినట్లుగా మోడీ చెబితే.. ప్రధాని తనకు ఫోన్ చేయటంపై మోహన్ లాల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు.. దాని నుంచి బయటకు వచ్చేందుకు ఏం చేయాలో మోడీ ప్రజలకు భలే ఐడియా ఇచ్చారని చెప్పక తప్పదు.