Begin typing your search above and press return to search.
కింగ్ ఖాన్ ను బీట్ చేసిన మోడీ
By: Tupaki Desk | 17 Jan 2016 6:41 AM GMTభారత్ లాంటి దేశంలో పార్టీల వారీగా నేతల్ని అభిమానించినా.. కథానాయకులకు.. సెలబ్రిటీలకు.. క్రీడాకారులకు ఉన్న ఆదరణతో పోలిస్తే కాస్త తక్కువనే చెప్పాలి. అందులోకి యువత.. చదువుకున్న వారు ఎక్కువగా వినియోగించే సోషల్ మీడియాలాంటి వాటిల్లో సెలబ్రిటీలు.. సినీ ప్రముఖులు.. క్రీడాకారులకు మాత్రమే పెద్ద పీట వేస్తుంటారు. అయితే.. అలాంటి వాటిని అధిగమించారు ప్రధాని మోడీ.
విపక్షాలు నరేంద్రమోడీ 20 నెలల పాలన మీద విమర్శలు చేస్తున్నా.. ఆయన్ను అభిమానించే వారు.. ఆయనపై అభిమానాన్ని ప్రకటించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇదెంతలా అంటే.. సినీ ప్రముఖుల్ని సైతం అధిగమించేంతగా ఉండటం గమనార్హం. తాజాగా ట్విట్టర్ లో మోడీ ను అనుసరించే ఫాలోయర్స్ సంఖ్య విషయంలో మరో రికార్డు నమోదైంది.
బాలీవుడ్ దిగ్గజం.. కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ ను అనుసరించే ట్విట్టర్ అభిమానుల సంఖ్య కంటే కూడా ప్రధాని మోడీని అభిమానించి అనుసరించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో.. జనవరి 16 నాటికి మోడీని అనుసరిస్తున్న వారి సంఖ్య 1,73,71,600కు చేరుకుంటే.. కింగ్ ఖాన్ షారూక్ ను అనుసరించే వారి సంఖ్య మాత్రం 1,73,51,100గా మాత్రమే ఉంది. దీంతో ఇప్పటివరకూ మూడో స్థానంలో ఉన్న మోడీ షారూక్ ను క్రాస్ చేసి సెకండ్ ప్లేస్ కి వెళ్లిపోతే.. ఆయన కంటే ముందు స్థానంలో అమితాబ్ బచ్చన్ మాత్రమే ఉన్నారు. ట్విట్టర్ లో ఆయన్ను అనుసరించే వారు 1.89కోట్లుగా ఉన్నారు. అంటే.. ప్రధాని మోడీ కంటే దాదాపు 16 లక్షలు అధికంగా ఉన్నారు.