Begin typing your search above and press return to search.
అద్వానీ పని అంతేనా?
By: Tupaki Desk | 31 March 2016 6:18 AM GMTప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగిసిన తరువాత కొత్త రాష్ట్రపతి ఎవరు అవుతారు? ఇప్పటికే దీనిపై ఎన్నో అంచనాలు. బీజేపీ కురువృద్ధుడు అద్వానీ కంటే ఆ పదవికి అర్హులెవరన్న మాట కొందరి నుంచి వినిపిస్తుంది. మరికొందరు ఎన్సీపీ నేత శరద్ పవార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారని అంటుంటారు. ఇంకొందరు మాత్రం మోడీని నచ్చిన వ్యక్తికి తప్ప ఇంకెవరికీ ఆ ఛాన్సు ఉండదని... రాజకీయాల నుంచి కాకుండా బయట నుంచి ఆయన ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ఆ అంచనాల ప్రకారమే తాజాగా కొత్త పేరొకటి వినిపిస్తోంది. అది.. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన బిగ్ బీ అమితాబ్ పేరు. అవును.... ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ ను రాష్ట్రపతి చేయాలని మోడీ అనుకుంటున్నారని తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ఈ విషయం వెల్లడించారు.
ఒక టివీ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమర్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను అరుణ్ జైట్లీ ద్వారా ప్రధానిని కలుసుకున్నానని చెప్పిన అమర్ సింగ్... మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను అమితాబ్ బచ్చన్ ను ఆయనకు పరిచయం చేశానని చెప్పుకున్నారు. ఆ పరిచయం తరువాతే మోడీ అమితాబ్ ను గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాల్సిందిగా కోరారని చెప్పారు. అమితాబ్ వివాద రహితుడు కావడం.. ప్రజాభిమానం ఉండడం... మోడీకి అనుకూలుడు కావడంతో ఆయనకు అవకాశం దక్కినా దక్కొచ్చు. అయితే... ప్రధాని పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకుని మోడీ కారణంగా ఆ అవకాశం కోల్పోయిన బీజేపీ సీనియర్ అద్వానీ పరిస్థితి మాత్రం అనిశ్చితిలో పడ్డట్లే. అయితే... అద్వానీకి మోడీ అన్యాయం చేయరన్న వాదనా ఒకటి వినిపిస్తోంది. ఏది ఏమైనా సరే... అమర్ సింగ్ మాటలతో ఒక్కసారిగా మళ్లీ రాష్ట్రపతి పదవిపై రాజకీయం ముదురుతోంది.