Begin typing your search above and press return to search.
అది చాలా మంచి నిర్ణయం : ప్రధాని మోడీ!
By: Tupaki Desk | 16 March 2020 6:30 PM GMTప్రస్తుతం కరోనా వైరస్ 135 దేశాల్లో వ్యాపించి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 6500 మంది చనిపోయారు. అలాగే... 142649 మందికి కరోనా భాదితులు ఉన్నారు. వారందరు హాస్పిటల్స్ లో ఉంటూ కరోనా కి ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ని నివారించడానికి అన్ని దేశాలు కూడా శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ , ఈ కరోనా వైరస్ బయటపడి నెలలు గడుస్తున్నా కూడా దీనికి మందు కనిపెట్టలేకపోతున్నారు.
మన దేశంలో 112 మంది ఈ వైరప్ బారినపడ్డారు. రోజురోజుకూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే స్కూళ్లు - కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. జిమ్ లు - స్విమ్మింగ్ పూల్స్ ని మూసివేయడంతో వివాహ కార్యక్రమాలపైనా ఆంక్షలు విధించాయి. ఇలా పూటకో వార్తతో కరోనా వైరస్ పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నీ నిర్ణయం చాలా తెలివైన నిర్ణయమంటూ ఆ నెటిజన్ ట్వీట్ ను రిట్వీట్ చేశారు. దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ రోజు అశు ముగ్లికర్ అనే ఓ నెటిజన్ ట్విటర్లో స్పందిస్తూ.. 'నా సమావేశాలన్నీ రద్దు చేసుకున్నాను. ఉద్యోగులంతా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఆఫీసుకు తాళం వేశాం. బిజినెస్ ప్రయాణలన్నీ నిలిపివేశాను. ఒక బాధ్యతాయుతమైన యజమానిగా పౌరులు, వారి భద్రతకే నా ప్రధమ ప్రాధాన్యం. నివారణే ఉత్తమం..' అని ట్విట్ చేసాడు. దీని పై ప్రధాని మోడీ స్పందిస్తూ... ఇది తెలివైన నిర్ణయం. అనవసరమైన ప్రయాణాలు రద్దు చేసుకోవడం.. పదిమందిలో తిరగడాన్ని తగ్గించుకోవడం... స్వాగతించదగిన చర్యలు అంటూ అశు పెట్టిన పోస్టును రీట్వీట్ చేశారు.