Begin typing your search above and press return to search.

ప్రధాని మెచ్చిన మన టీచరమ్మ

By:  Tupaki Desk   |   6 Sep 2018 10:53 AM GMT
ప్రధాని మెచ్చిన మన టీచరమ్మ
X
తెలుగు ఉపాధ్యాయిని ప్రధాని నరేంద్రమోడీని మెప్పించింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికైన ఆమె విశేష ప్రతిభకు ప్రధాని ఆశ్చర్యపోయారు. తాజాగా ఉపాధ్యాయిని మేకా సుసత్యరేఖపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె సేవలను కొనియాడుతూ స్వయంగా ట్వీట్ చేయడం విశేషం. చిన్నారులకు అర్థమయ్యేలా ఆసక్తికరంగా గణితం - సైన్స్ బోధిస్తున్నారని కొనియాడారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని కోరారు.

సుసత్య రేఖ కుటుంబం మొత్తం ఉపాధ్యాయులే కావడం గమనార్హం. అమ్మ - తాత - తండ్రి - లు ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త గురయ్య - అక్క ఇంద్రాణి బావ - చెల్లెలు - మేనమామ కూడా ఉపాధ్యాయులే..

తమ కుమార్తె జాతీయ స్థాయిలో పురస్కారం అందుకోవడం.. ప్రధాని మెచ్చుకోవడంపై సుసత్య రేఖ తల్లి సత్యవతి దేవి ఆనందం వ్యక్తం చేశారు. సుసత్య రేఖ చదువు మండపేట - ధవళేశ్వరం - రాజమండ్రిలో జరిగింది..ప్రస్తుతం సుసత్య నివేదిత కిశోర్ విహార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. సుసత్య 1991 జులైలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. ఆటల ద్వారా పిల్లలకు అర్థమయ్యే రీతిలో సులభంగా లెక్కలు బోధించడం సుసత్య ప్రత్యేకత..