Begin typing your search above and press return to search.

యోగిలో డిఫరెంట్ యాంగిల్ ఉందంటున్న మోదీ

By:  Tupaki Desk   |   25 Dec 2017 1:24 PM GMT
యోగిలో డిఫరెంట్ యాంగిల్ ఉందంటున్న మోదీ
X

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ను చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. సనాతనవాది అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ.. ఆయన ఏమాత్రం సనాతనవాది కాదని - ఆధునిక భావాలున్న సీఎం అని సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ సర్టిఫికేట్ ఇచ్చారు. నెగటివ్ సెంటిమెంట్లు - మూఢనమ్మకాలను పక్కన పెట్టి మరీ ఆయన నోయిడాలో మెట్రో రైలు ప్రారంభించారని మోదీ చెప్పుకొచ్చారు.యోగి ఆధునికవాది కాదు - ఛాందసుడు అనేవారందరికీ ఇది కనువిప్పని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన యోగిపై ప్రశంసల వర్షం కురిపించారు.

క్రిస్మస్‌ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కలిసి నోయిడాకు కొత్త మెట్రో రైల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోయిడాపై ఉన్న సెంటిమెంటును ప్రస్తావించారు. గతంలో సీఎంలు ఎవరూ కూడా నోయిడాలో అడుగుపెట్టేవారు కాదని.. అక్కడ ఏ కార్యక్రమం చేప్టటినా పదవి పోతుందన్న సెంటిమెంటు ఉంది. దానికి శాపగ్రస్త నగరం అన్న ముద్ర ఉంది. అయితే.. యోగి ఆ ముద్రను పోగొట్టే ప్రయత్నం చేశారని మోదీ అన్నారు. గతంలో ముఖ్యమంత్రులు అయిన వారెవ్వరూ కూడా నోయిడాలో అడుగుపెట్టే సాహసం చేయలేదని... కానీ, తొలిసారి సీఎం యోగి మాత్రం నోయిడాలో మెట్రో ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు.

‘నమ్మకం అనేది ముఖ్యమే కానీ.. గుడ్డి నమ్మకాలు మంచివి కావు... నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో కూడా నన్ను ఇలాగే చాలామంది కొన్ని ప్రాంతాలకు వెళ్లొద్దని చెప్పారు. కానీ, నేను మాత్రం అవేమీ పట్టించుకోలేదు.. వారు వద్దన్న ప్రతి చోటికీ వెళ్లాను’’ అన్నారు. క్షుద్రపూజలపై - మంత్ర శక్తులపై - శాపాలపై నమ్మకంతో కొందరు నాయకులు కొన్ని ప్రాంతాల్లో అడుగుపెట్టడం లేదు.. అలాంటి వారు ముఖ్యమంత్రులుగా ఉండడానికి కూడా అర్హులు కారన్నారు.