Begin typing your search above and press return to search.
మోడీ ‘‘నైట్ ప్లాన్’’ అదిరింది
By: Tupaki Desk | 9 April 2016 10:07 AM GMTఇప్పటివరకూ దేశ ప్రధానులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారిలో మోడీ తీరు పూర్తి భిన్నం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయనకు స్వదేశం కంటే విదేశాల్లోనే విపరీతమైన క్రేజ్ అని చెప్పక తప్పదు. ఆయన తరచూ చూసే ఫారిన్ టూర్ విషయంపై రాజకీయ పక్షాలన్నీ విమర్శలు చేస్తున్నా.. ఆయన ఫారిన్ పాలసీ మీద ఇప్పటివరకూ ప్రశంసలే తప్పించి విమర్శలు పెద్దగా వచ్చింది లేదు.
అలాంటి మోడీ.. తన ఫారిన్ టూర్ సందర్భంగా నైట్ ప్లాన్ విషయంలో అనుసరిస్తున్న వైనం ఆసక్తికరంగా ఉండటమే కాదు.. మోడీ దూరదృష్టికి అభినందించకుండా ఉండలేం. విదేశీ పర్యటనల సందర్భంగా ఏ మాత్రం సమయం వృధా కాకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నవిధానం స్పష్టంగా తెలుస్తుంది. వరుస విదేశీ ప్రయాణాల సందర్భంగా తక్కువ సమయంలోనే వివిధ దేశాల్ని పర్యటిస్తుంటారు. మామూలుగా అయితే.. ఇది సాధ్యం కాదు. కానీ.. మోడీ అనుసరిస్తున్న నైట్ ప్లానింగ్ కారణంగా ఇలాంటివి సాధ్యమవుతున్నట్లు చెప్పాలి. తన ఫారిన్ ట్రిప్ లో భాగంగా ఏ దేశంలోనూ మోడీ నైట్ స్టే చేయకుండా ఉంటున్నారు.
రాత్రి అయితే చాలు.. ఆ టైంలో ఆయన విమానంలో రెస్ట్ తీసుకుంటూ.. నైట్ పూర్తి అయ్యే లోపు జర్నీ పూర్తి చేసుకొని మరో దేశంలో అడుగు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో బోలెడంత సమయం ఆదా కావటంతో పాటు.. హోటల్ రూంలు తీసుకునే అవసరం లేకుండా చేస్తోంది. తాజాగా ఆయన నాలుగు రోజుల్లో మూడు దేశాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి బెల్జియం రాజధాని బ్రసెల్స్ వెళ్లిన మోడీ.. అక్కడ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్.. ఆ తర్వాత సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు వెళ్లటం తెలిసిందే. ఈ మూడు దేశాల్ని రాత్రి సమయంలో ప్రయాణం పెట్టుకొని మోడీ సమయాన్ని ఆదా చేశారు. మోడీ నైట్ జర్నీ ప్లానింగ్ బాగుంది కదూ..?