Begin typing your search above and press return to search.
సౌత్ లో పాగాకు మోడీ మాస్టర్ ప్లాన్!
By: Tupaki Desk | 24 July 2017 6:00 AM GMTఎంత ప్రయత్నించినా కొరుకుడుపడని దక్షిణాదిలో పాగా వేసేందుకు ప్రధాని మోడీ మాస్టర్ ప్లాన్ బయటకు తీశారు. దేశమంతా కమల వికాసం సాధ్యమవుతున్నా.. దక్షిణాది మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవటం కమలనాథుల్ని కలవరపెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోకొంత ఉనికిని సొంతం చేసుకోవచ్చని భావించినా.. అదేమీ వర్క్ వుట్ కాకపోవటం తెలిసిందే. ఇక.. తమిళనాడు అమ్మ లేని తర్వాత.. పెద్దన్న బాధ్యతల్ని పోషించి.. అన్నాడీఎంకేకు తోడుగా ఉందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తమిళులు ససేమిరా అనటం తెలిసిందే.
ఇలాంటి వేళ.. దక్షిణాది ప్రజల మనసుల్ని దోచుకునేందుకు మోడీ తాజాగా సరికొత్త సమ్మోహస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని దక్షిణాది వాకిట్లోకి తీసుకొచ్చేందుకు వీలుగా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ భారతీయులకు ప్రధానమంత్రి కార్యాలయాన్ని దగ్గర చేసేందుకు వీలుగా అని చెబుతున్నా అసలు కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే.
ఒకవేళ నిజంగానే దక్షిణాది వారికి దగ్గరయ్యేందుకే అనుకుంటే.. మిగిలిన రాష్ట్రాల్ని వదిలేసి.. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్రాన్ని ఎంచుకోవటం చూస్తేనే.. కమలనాథుల ఆలోచనలు ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు. ప్రత్యేక ప్రధానమంత్రి కార్యాలయాన్ని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మహా నగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోడీ తీర్మానించినట్లుగా చెబుతున్నారు. మోడీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఆత్మగా చెప్పుకునే అమిత్ షా ఊరికే ఉంటారా? ఆయన కూడా తనదైన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. బెంగళూరులో ప్రత్యేక ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బెంగళూరులో నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధపడుతున్నట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. మోడీ తర్వాతి టార్గెట్ దక్షినాదేనన్న భావన కలగటం ఖాయం.