Begin typing your search above and press return to search.

ఇక ఏ క్ష‌ణానైనా కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌!

By:  Tupaki Desk   |   31 Aug 2017 11:05 AM GMT
ఇక ఏ క్ష‌ణానైనా కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌!
X
2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా దూసుకుపోవాల‌ని భావిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆదిశ‌గా అడుగులు వ‌డివ‌డిగా వేస్తోంది. ప‌లు పార్టీల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత బ‌లం పుంజుకోవాల‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో కేంద్రంలో ప‌ద‌వులు ఆశిస్తున్న కొన్ని పార్టీల నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - బీజేపీ సార‌ధి అమిత్ షాలు నిర్ణ‌యించారు. దీంతో కేంద్ర కేబినెట్‌ ను విస్త‌రించ‌డం ద్వారా ప‌లు ప‌ద‌వుల‌ను మిత్ర ప‌క్షాల‌కు పంచాల‌ని డిసైడ్ అయ్యారు.

ఇక‌, ఈ విష‌యం ఇప్ప‌టికే హ‌ల్ చ‌ల్ చేస్తండ‌గా.. తాజాగా దీనిపై పూర్తిస్థాయిలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది. వెనువెంట‌నే కేబినెట్‌ ను విస్త‌రించ‌డం ద్వారా ఆయా పార్టీల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించాల‌ని మోదీ - షాలు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే పెద్ద ఆల‌స్యం ఏమీ పెట్టుకోకుండా సాధ్య‌మైనంత వేగంగా దీనిని ముగించాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అమిత్‌ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. గురువారం జరిగిన ఈ భేటీకి కేంద్రమంత్రులు హాజరయ్యారు. దీంతో రెండు - మూడు రోజుల్లో కేంద్ర కేబినెట్‌ ను విస్తరించ‌డం ఖాయం అనే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది.

వాస్త‌వానికి సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళుతున్నారు. దీనికి ముందే ఆయ‌న కేబినెట్ విస్త‌ర‌ణ క్ర‌తువును పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం కేంద్రంలో ప్ర‌ధానంగా ర‌క్ష‌ణ శాఖ స‌హా వెంక‌య్య నిర్వ‌హించిన ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రిత్వ శాఖ - కొన్ని ఇత‌ర శాఖ‌లు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొంద‌రిని త‌ప్పించాల‌ని కూడా మోదీ నిర్ణ‌యించారు. దీంతో దాదాపు ఏడు నుంచి 8 మందికి అవ‌కాశం ద‌క్కుతుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ పోస్టుల‌ను కొన్ని సొంత నేత‌ల‌కు ఇచ్చినా.. ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో అన్నాడీఎంకే - ఎన్సీపీ ల‌కు కూడా కేటాయించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదేవిధంగా బిహార్‌ లో బీజేపీని అధికారంలోకి వ‌చ్చేలా చ‌క్రం తిప్పిన సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు కూడా మంత్రి ప‌ద‌వులు ద‌క్కే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే షా అత్య‌వ‌స‌ర స‌మావేశం ఆస‌క్తిగా మారింది.