Begin typing your search above and press return to search.
చంద్రబాబు అతి వినయం రివర్స్ అయింది
By: Tupaki Desk | 27 Aug 2015 7:50 AM GMTతెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టైం బాగా లేనట్లుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు బాబు కోటి ఆశలతో ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించి ఏపీకి ప్రత్యేక హోదా తప్పనిసరి సాధిస్తాను అని బాబు భరోసాతో వెళ్లారు. అయితే సీన్ రివర్స్ అయింది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు దాదాపు లేవని మోడీ తేల్చిచెప్పారు. మరోవైపు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సైతం అదే భావనను వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబుకు నిరాశ తప్పలేదు. అయితే తాజాగా బాబు టెక్నికల్ సహాయకులు చేసిన పని ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టడమే కాదు..బాబుకున్న పేరుకు మసక తెచ్చేలా తయారైంది కూడా.
ప్రధానమంత్రిని కలిసిన అనంతరం చంద్రబాబు తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్లో సమావేశం తాలుకు వివరాలు పొందుపర్చారు. ప్రధానమంత్రిని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ర్ట విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని తాను విన్నవించినట్లు చెప్పారు. దీన్ని పేర్కొంటున్న సమయంలో బాబు చూపిన వినయం ఆయనకు దెబ్బతెచ్చిపెట్టింది.
ప్రధానమంత్రిని నరేంద్రమోడీ అని పేర్కొనకుండా గౌరవప్రాయంగా @narendramodiji అని బాబు ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తి కోట్ చేశారు. అయితే ఈ ఖాతా ప్రధానమంత్రిది కాదు. బీజేపీ సానుభూతిపరుడు, నరేంద్రమోడీ అభిమాని అయిన బీటెక్ విద్యార్థి ప్రతీక్ భూటానీది. క్రికెటర్ ధోనీ, ఆపిల్ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ అభిమాని అయిన ప్రతీక్ @narendramodiji పేరుతో ట్విట్టర్ ఖాతా నిర్వహించుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ప్రస్తావించింది ప్రధానమంత్రిని కాకుండా బీటెక్ విద్యార్థిని అన్నట్లయింది.