Begin typing your search above and press return to search.
ఎమర్జెన్సీ మీద సరే.. అద్వానీ మాటల సంగతేంటి?
By: Tupaki Desk | 25 Jun 2015 8:33 AM GMTదివంగత ప్రధాని ఇందిర హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి గడిచి 40 ఏళ్లు అయిన సందర్భంగా బీజేపీ నేతలు ఈ విషయాన్ని అత్యధిక ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు.. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజాస్వామ్యంలో హక్కులు ఎంతలా కాలరాచారన్న అంశాన్ని భారీగా ప్రచారం చేయటం తెలిసిందే. తాజాగా నాటి ఎమెర్జన్సీ పరిస్థితులపై మోడీ ట్విట్టర్‌లో స్పందించటం తెలిసిందే.
ట్విట్టర్‌లో ఆయన ఈ విషయంపై రియాక్ట్ అవుతూ.. అనాటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని కాలరాశారాని.. ఎమర్జన్సీని ఎదుర్కొన్న వారంతా మన అందరికి గర్వకారణమని పేర్కొన్నారు. అప్పట్లో చీకటి రోజుల్ని చూశామని పేర్కొన్న మోడీ.. తాజాగా తన పార్టీకి చెందిన అగ్రనేత అద్వానీ చేసిన వ్యాఖ్యలపై మాత్రం పొల్లు కూడా ప్రస్తావించలేదు.
ఎమర్జన్సీ ముప్పు భారత్‌కు ఉందని.. ఏక వ్యక్తి పాలన ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందంటూ ఆ మధ్యన ఇచ్చిన ఇంటర్వ్యూలో అద్వానీ పేర్కొన్న అంశాలపై మౌనం దాల్చిన మోడీ.. ఇందిర హయాంలోని అత్యవసర పరిస్థితి మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ఎదుటి వారి తప్పుల్ని వెతికే వారు.. తమ తప్పుల్ని అస్సలు గుర్తించరన్న మాటకు మోడీ కూడా మినహాయింపు కాదా?