Begin typing your search above and press return to search.
మోడీ మాటల్లో భయం
By: Tupaki Desk | 22 Feb 2016 11:30 AM GMTప్రధాని మోడీకి పదవీభయం పట్టుకుందా?. ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రసాగుతోందా?. స్వయంగా ప్రధానే అలాంటి భయానికి లోనవుతున్నట్లుగా సంకేతాలిస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని స్థాయిలో ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న వారెవరో కూడా ఆయన వెల్లడించారు. ఎన్జీవోలు - బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఆదివారం ఒడిశాలోని బరగఢ్ లో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
''ప్రధానిని పదవి నుంచి దించడానికి కొందరు నిరంతరం కుట్రలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు… నాపై వివిధ రూపాల్లో దాడి చేస్తునే ఉన్నారు. కొంతమంది అదే పనిపై ఉన్నారు. మునుపటి మాదిరిగా రసాయన కర్మాగారాలకు యూరియా తరలిపోకుండా వేపపూత వేయిస్తున్నాం. ఇలాంటి చర్యవల్ల ఇంతకాలం దోచుకుంటున్న కెమికల్ ఫ్యాక్టరీలకు మోదీపై కోపం రాకుండా ఉంటుందా? మోదీకి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే వారు సాయపడకుండా ఉంటారా? ప్రధానికి వ్యతిరేకంగా వారు కేకలు వేయకుండా ఉంటారా?" అని వ్యాఖ్యానించారు. విదేశీ విరాళాలు సేకరిస్తున్న ఎన్జీవోలను లెక్కలు సమర్పించాలని అడిగితే.. వారంతా కలిసి ఒక్కటై తనపై కక్ష గట్టారని మోడీ ఆరోపించారు. కానీ వాటిని తాను భయపడనని … ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పారు.
మొత్తానికి దేశంలో జరుగుతున్న ఉద్యమాల వెనుక కొన్ని శక్తులు ఉన్నట్లే బయటకు కనిపించకుండానూ కొందరు ప్రభుత్వ వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్నారని... మోడీ దాన్ని పసిగట్టి జాగ్రత్త పడుతున్నారని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.