Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ఓ పార్టీ కాదు వంశము : మోడీ
By: Tupaki Desk | 4 Dec 2017 12:06 PM GMTఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికను అస్త్రంగా చేసుకుని ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. సంస్థాగత ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం నిర్వహించిన పలు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. మీ సొంత పార్టీలోనే ప్రజాస్వామ్యం లేకపోతే.. దేశంలో దాన్ని ఎలా అమలు చేస్తారు? కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికవుతారో ముందే నిర్ణయమైపోయింది అని రాహుల్‌గాంధీని ఉద్దేశించి పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కాంగ్రెస్ విమర్శలను ప్రధాని గట్టిగా తిప్పికొట్టారు. బుల్లెట్ రైలుతో మీకు సమస్య ఉంటే.. ఎడ్ల బండ్లలో తిరుగండి అని విమర్శించారు.
`కాంగ్రెస్ గురించి గుజరాత్ ప్రజలకు బాగా తెలుసు. కాంగ్రెస్ తన రంగులను ఎప్పటికప్పుడు మారుస్తుంది. సోదరుల మధ్య గోడ కడుతుంది. ఒక కులంతో మరో కులానికి.. ఒక మతంతో మరో మతానికి మధ్య చిచ్చుపెడుతుంది` అని ప్రధాని విమర్శించారు. హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవానీ, అల్పేశ్ ఠాకూర్ వంటి కుల నాయకులతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడంపై మాట్లాడుతూ `వారు (కాంగ్రెస్) మిమ్మల్ని కొట్లాటల్లో నిమగ్నమయ్యేలా చేస్తారు. మీరు ఒకవేళ చనిపోయినా కాంగ్రెస్ నాయకులు మలాయ్ తింటారు. అయితే గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ రోగాలన్నీ నయమైపోయాయి` అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఔరంగజేబ్ పాలనను కొనసాగిస్తున్నదని, కాంగ్రెస్ ఓ పార్టీ కాదు వంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ నామినేషన్ దాఖలు చేయడంపై మోడీ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. `ఔరంగజేబ్ పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు. మాకు మాత్రం 125 కోట్ల మంది భారతీయుల బాగోగులే కావాలి. వాళ్లే మాకు హైకమాండ్. కాంగ్రెస్ నేతలే తమది పార్టీ కాదు ఓ వంశమని అంగీకరిస్తున్నారు` అని మోడీ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కామెంట్స్‌ను మోడీ ప్రస్తావించారు. షాజహాన్ స్థానంలో జహంగీర్ వచ్చినపుడు ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత ఔరంగాజేబ్ వచ్చిన సమయంలోనూ ఎన్నికలు నిర్వహించారు. రాజు కొడుకుకే అధికారం కట్టబెడతారని తెలిసీ వీటిని నిర్వహించారు అని మణిశంకర్ అయ్యర్ అన్నారు. అంటే ఆయన వ్యాఖ్యలను బట్టి తమది కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ అంగీకరిస్తున్నట్లే. కానీ మాకు మాత్రం ఈ ఔరంగాజేబ్ పాలన అవసరం లేదు అని మోడీ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి రాహుల్ ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఇక రాహుల్ పగ్గాలు చేపట్టడం లాంచనంగా మారింది.