Begin typing your search above and press return to search.

చిరును సంక‌టంలో ప‌డేసిన మోడీ.. ఆహ్వానించి.. మ‌రీ ఇబ్బంది పెట్టారే!

By:  Tupaki Desk   |   29 Jun 2022 3:58 AM GMT
చిరును సంక‌టంలో ప‌డేసిన మోడీ.. ఆహ్వానించి.. మ‌రీ ఇబ్బంది పెట్టారే!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. మెగాస్టార్‌ను సంక‌టంలో ప‌డేశారు. త‌న ప‌ర్య‌ట‌న‌కు ఆయ‌న‌ను ఆహ్వానించి.. తీవ్ర ఇబ్బందిలోకి నెట్టార‌నే వాద‌న వినిపిస్తోంది. జూలై 4న ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు.

వచ్చే నెల 4న రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు. జులై 4వ తేదీ ఉదయం 10.10 గం.కు విజయవాడకు ప్రధాని చేరుకుంటారు. అనంతరం 10.50 గం.కు హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లనున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ పాల్గొంటారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఏర్పటు చేసిన 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు.

అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించినున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో దాదాపు గంటం పావు పాటు ప్రధాని ఉండనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి డిల్లీ వెళ్తారు.

భీమవరంలో జరుగునున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వా నాన్ని పంపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జరుగనున్న అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

రాజ‌కీయంగా ఇబ్బందే! ప్ర‌స్తుతం చిరంజీవి రాజ‌కీయంగా ప్రాధాన్యం చూప‌డం లేదు. అయితే.. ఆయ‌న ప్ర‌ధాని మోడీ కార్య‌క్ర‌మంలో పాల్గొంటే.. ఇది బీజేపీకి క‌లిసి వ‌స్తుంద‌ని.. ప‌రోక్షంగా.. జ‌న‌సేన‌కు మైన‌స్ అవుతుంద‌ని అంటున్నారు. ఎలాగంటే.. ప్ర‌స్తుతం పైకి బీజేపీతో పొత్తు ఉంద‌ని అంటున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన వేరే పార్టీతో పొత్తు కు సిద్ధ‌ప‌డాల‌ని..

జ‌న‌సేన నాయ‌కులు.. సానుభూతి ప‌రులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌ధాని మోడీ స‌భ‌కు చిరు హాజ‌రైతే.. అది బీజేపీకి మ‌ద్ద‌తుగా భావించాల్సి వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో చిరు ఎలాంటి నిర్న‌యం తీసుకుంటా రో చూడాలి.