Begin typing your search above and press return to search.

నేను జర్మనీ వచ్చింది ఎందుకంటే...

By:  Tupaki Desk   |   15 April 2015 5:44 AM GMT
నేను జర్మనీ వచ్చింది ఎందుకంటే...
X
జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ... తన ప్రసంగాలతో అక్కడి అధికారులను, పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడిదారులనూ బాగానే ఆకర్షిస్తున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా లో భాగంగా విదేశీపర్యటనలు చేస్తున్న మోడీ అందుకు అనుగుణంగా భారత్‌ కు పెట్టుబడులు రప్పించేందుకు తెగ కృషి చేస్తున్నారు. జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గన్న మోడీ... తనదైన శైలిలో ప్రసంగించారు. మోడీ జర్మనీ ప్రెస్‌ మీట్‌ ముఖ్యాంశాలు...

.....నేను ఇక్కడికి వచ్చింది జర్మనీ పెట్టుబడిదారులను భారత్‌కు ఆహ్వానించటానికి మాత్రమే కాదు. భారత్‌లో పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు అనువైన, స్థిరమైన పరిస్థితులు ఉన్నాయని హామీ ఇచ్చేందుకు!

.....తయారీరంగంలో భారత్‌ కు జర్మనీ సహకారం చాలా అవసరం... ఈ విషయంలో భారత్‌ అభివృద్ధి చెందితే అందరికీ వాణిజ్యావకాశాలు మెరుగవుతాయి.

.....పారిశ్రామికాభివృద్ధిలో ఎంతో ముందున్న జర్మనీ, మానవ వనరులు పుష్కలంగా ఉన్న భారత్‌తో చేయికలిపితే... రెండుదేశాలు ప్రపంచంలోనే బలమైన శక్తిగా అవతరిస్తాయి.

.....భారత్‌లో సామాన్య పౌరుల జీవితాల్లో నాణ్యమైన మార్పు కోసం మా లక్ష్యాలను మేము సాధించడానికి సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న జర్మనీ సహకారం ఎంతో అవసరం.

.....నైపుణ్యం ఆధారంగా భారత్‌ లో యువతకు ఉద్యోగాలు సృష్టించటమే మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యం. ఈ విషయంలో ప్రపంచానికే లీడర్‌ అయిన జర్మనీ సహకారం ఎంతైనా అవసరం.

.....భారత పారిశ్రామికాభివృద్ధి కోసం చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో జర్మనీ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి.

.....జర్మనీ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తల సౌకర్యం కోసం అవసరమైతే భారత్‌లో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేస్తాం.

.....ప్రపంచ రాజు సింహం (మేక్‌ ఇన్‌ ఇండియా గుర్తు), ఆకాశ రాజు డేగ (జర్మనీ జాతీయ పక్షి) కలిస్తే బలమైన శక్తిగా అవతరిస్తాయి.