Begin typing your search above and press return to search.
ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మోడీ స్పీచ్ ఎలా సాగింది?
By: Tupaki Desk | 28 Sep 2019 5:23 AM GMTఅంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. తనకు కేటాయించిన 20 నిమిషాలకు మూడు నిమిషాల ముందే తన ప్రసంగాన్ని ముగించిన ఆయన.. ఎక్కడా దాయాది పాక్ మీద ప్రత్యక్ష విమర్శలు చేయలేదు. అదే సమయంలో భారతదేశం తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పటమే కాదు.. ఈ గుణం తమకు అనాది నుంచే ఉందన్న విషయం అర్థమయ్యేలా కొన్ని ఉదాహరణలు చూపిస్తూ మాట్లాడారు.
దూషణభూషణలతో పాటు నిందాపూర్వకంగా సాగిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగానికి భిన్నంగా మోడీ ప్రసంగం సాగింది. ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం గురించి.. దానిపై ప్రపంచ దేశాలు పోరాడాల్సిన అంశాన్ని ప్రస్తావించటంతో పాటు.. ప్రపంచం విషయంలో భారత్ ఎంత బాధ్యతగా ఉంటుందన్న విషయాన్ని తన మాటలతో చెప్పారు.
ప్రపంచానికి తాము యుద్ధాన్ని ఇవ్వలేదని.. బౌద్దాన్ని ఇచ్చిన వైనాన్ని గుర్తు చేసిన మోడీ.. బుద్ధుడు ప్రవచించిన శాంతి సందేశాన్ని తాము ఇచ్చామని.. ఉగ్రవాదంపై ప్రపంచానికి తాము చేసిన హెచ్చరికలు ఆగ్రహం.. తీవ్రత.. ఆవేదన.. నిబద్ధత ఉన్నాయన్నారు. శాంతి మంత్రాన్ని అదే పనిగా జపించిన మోడీ.. గడిచిన ఐదేళ్లలో తమ ప్రభుత్వం భారతదేశ ముఖాన్ని ఎలా మార్చింది.. సంక్షేమానికి ఎంత పెద్ద పీట వేసిన విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
మానవాళి శ్రేయస్సు కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకతాటి మీద నిలవటం అత్యవసరమన్న ఆయన.. ఉగ్రవాదం తమ ఒక్కరి సమస్య కాదని.. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ అన్నారు. మోడీ ప్రసంగంలోని కీలకాంశాల్ని చూస్తే..
+ 130 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రతినిధిగా మాట్లాడడం ఓ గొప్ప గౌరవం. మేం అన్ని ప్రాంతాలకూ చెందిన వారం.. అందరి వాళ్లం అని సుప్రసిద్ధ తమిళ కవి కనియాన్ పుంగుద్రనార్ మూడు వేల ఏళ్ల కిందటే చెప్పారు. ఇది మా దృష్టీ.. మా ఆలోచనలు.. ప్రపంచ అభ్యున్నతి మీకు తెలిసేలా చేస్తాయి.
+ ప్రపంచానికి మేం యుద్ధాన్ని ఇవ్వలేదు.. బౌద్ధాన్ని ఇచ్చాం. గౌతమ బుద్ధుడు ప్రవచించిన శాంతి సందేశాన్ని ఇచ్చాం. మానవాళి శ్రేయస్సు కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపై నిలవడం ఇపుడు అత్యవసరం. ఉగ్రవాదం చేస్తున్న నష్టంపై ప్రపంచదేశాలు ఆగ్రహించడం అవసరం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపై నిలవడం ఇపుడు అత్యవసరం.
+ ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయేది భారత సైనికులే. 160 మంది భారతీయులు మరణించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సంవత్సరమిది. ఆయన ప్రవచించిన శాంతి, అహింస నేటికీ ఆచరణీయాలు. శాంతి సామరస్యాలే మేమిచ్చే సందేశం.. పగలూ- విరోధాలు కాదు.
+ వేల సంవత్సరాల సంస్కతి మాది.. అనేక సంప్రదాయాల కలబోత మాది.. ప్రజలందరి సమష్టి కృషి ద్వారానే ఇవన్నీ సాధ్యం. అందరి కృషి.. ప్రతి ఒక్కరి అభ్యున్నతి మా లక్ష్యం. విశ్వమానవ శ్రేయస్సును మేం కాంక్షిస్తాం. జనకల్యాణ్ నుంచి జగ్‌కల్యాణ్‌కు మా ప్రయాణం. ప్రపంచ ప్రజలందరివీ ఇవే కలలు.. ఆకాంక్షలు. అందుకే కృషి మాది, ఫలాలు అందరివీ!
+ ఇక్కడికి అడుగుపెడుతున్నపుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధం అన్న నినాదాన్ని ఇక్కడి గోడలపై రాసి ఉండడాన్ని చూశాను. దేశాన్ని ప్లాస్టిక్ రహితం చేసే అతి పెద్ద కార్యక్రమాన్ని మేం ఇప్పటికే ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నా.
+ భూగోళం వేడెక్కడంలో మా పాత్ర చాలా తక్కువ.. అయినప్పటికీ గ్లోబల్ వార్మింగ్ నిరోధానికి మా వంతు కృషి చేస్తున్నాం.. 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంతర్జాతీయ సౌరవిద్యుత్ కూటమి ఏర్పాటు ఈ దిశలోనిదే! గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రకృతి వైపరీత్యాలు పెరిగాయి. ఇందుకోసమే మేం ‘విపత్తు నిరోధక సంకీర్ణ వ్యవస్థ’ ఏర్పాటుకు చొరవ చూపాం.
+ ప్రపంచ రూపురేఖలు మారిపోతున్నాయి. సామాజిక - వ్యక్తిగత జీవనాలు - ఆర్థిక - భద్రతాపరమైన - అంతర్జాతీయ అంశాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి సాంకేతికత అన్ని రంగాల్లో విస్తరించి ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో చీలికలు ఎవరికీ మంచివి కావు. మా సరిహద్దుల్లోపలే గిరి గీసుకుని కూర్చోలేం. విశాల దృక్పథం కావాలి. బహుళపక్షత నేడు అవశ్యం.. ఐక్యరాజ్యసమితిలో కూడా ఇది అవసరం.