Begin typing your search above and press return to search.

మోడీ న్యూ ఇయర్ సర్ ఫ్రైజ్ ఏమిటి!

By:  Tupaki Desk   |   29 Dec 2016 1:33 PM GMT
మోడీ న్యూ ఇయర్ సర్ ఫ్రైజ్ ఏమిటి!
X
నవంబర్ 8 న హఠాత్తుగా నోట్ల రద్దును ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - నూతన సంవత్సర కానుకగా మరేమి చేయబోతున్నారనే చర్చ తాజాగా మొదలైంది. ఇప్పటికే డిసెంబర్ 31న మోడీ ఒక సమావేశంపై నిర్వహించబోతున్నారని తెలిసిన అనంతర నల్లకుబేరులకు - అక్రమార్కులకు రానున్నది కష్టకాలమే అంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ సమావేశంపై పలు అంచనాలు నెలకొన్నాయి. పాత నోట్ల డిపాజిట్లకు సమయం డిసెంబరు 30, శుక్రవారంతో ముగియనుండడంతో తర్వాతి రోజు కానీ, నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1 న కానీ ప్రధాని జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో ఏమి చెప్పబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్!

జనాల వద్ద ఉన్న పాత నోట్లు ఇప్పటికే బ్యాంకులకు చేరిపోయినప్పటికీ.. బ్యాంకుల్లోనూ, ఏటీఎంలలోనూ కొత్త నగదు కొరత ఇంకా అలానే ఉందనేది జగమెరిగిన సత్యం. ఇదే క్రమంలో డిపాజిట్ పై ఆంక్షలను కూడా పొడిగించే అవకాశాలున్నాయని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు మోడీ ఇచ్చే బహుమై ఏమిటి? నల్లకుబేరుల తాట తీశానని, జన్ థన్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నానని చెబుతారా లేక... మరేమైన కొత్త బాంబులు పేల్చుతారా అనేది వేచి చూడాలి! నోట్ల రద్దు అనంతరం ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ప్రజలను 50రోజుల గడువు ఇవ్వండని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ గడువు కాస్తా పూర్తవడంతో ఈ సారి ఏ ప్రకటన చేస్తారోననే సస్పెన్స్ తాజాగా నెలకొంది.

యుద్దంలో ఓడిపోయినప్పుడే పోరాటం గురించి ప్రసంగించుకోవాలి అన్నట్లు... నోట్లరద్దు నిర్ణయ ఫలితం దాదాపు శూన్యం అని కథనాలొస్తున్న తరుణంలో నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై భారీ ప్రచారం నిర్వహించేందుకు మంత్రులను, నేతలను సన్నద్ధం చేస్తోంది కేంద్రప్రభుత్వం. దీనికి సంబంధించి సుమారు 60 పేజీల డాక్యుమెంట్ ను ఇప్పటికే మంత్రులందరికీ పంపిణీ చేయగా, ఇందులో పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ పాయింట్ టు పాయింట్ చేర్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కొంతమంది నెతలు గత రెండు వారల క్రితమే నోట్ల రద్దుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్న తరుణంలో... మోడీ ప్రకటించబోయే న్యూ ఇయర్ సర్ ఫ్రైజ్ ఏమిటి అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగితే సరిపోతుందేమో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/