Begin typing your search above and press return to search.

బ్యాంకుల్లో మోడీ స్టింగ్ ఆపరేషన్ చేశాడా?

By:  Tupaki Desk   |   12 Dec 2016 10:41 AM GMT
బ్యాంకుల్లో మోడీ స్టింగ్ ఆపరేషన్ చేశాడా?
X
అక్రమాలకు పాల్పడిన బ్యాంకు అధికారులకు గుండెల్లో గునపం దింపేలాంటి వార్త ఇది. పెద్ద నోట్ల రద్దు తరువాత జనానికి కొత్త నోట్లు దొరక్కుండా చేసి అడ్డదారిన పెద్ద మనుషులను డబ్బు సర్దుతూ ఫుల్లుగా సంపాదించుకుంటున్న బ్యాంకు అధికారుల భరతం పట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మొత్తం డాటాను సమీకరించేసింది. రకరకాల మార్గాల్లో ఆ ఆధారాలను సేకరించింది.

ఇందులో షాకింగ్ ఏంటంటే.. బ్యాంకుల శాఖల్లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి సంబంధించిన ఆధారాలను ప్రభుత్వం స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా సేకరించింది. 500 బ్యాంకు శాఖల్లో మోడీ టీం నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో అక్రమాలకు పాల్పడుతున్న వారికి సంబంధించిన ఆధారాలను సేకరించారు. వాటిని సుమారు 400 సిడిల్లో నమోదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అంతే కాదు వారి ద్వారా డబ్బులు తీసుకున్న పెద్దలంతా ఇపుడు బయటకు రానున్నారు.

రెవెన్యూ ఇంటిలిజెన్సు బ్యూరో కూడా దీనిపై సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. బ్యాంకులు కరెక్టుగా ఉంటే డీమానిటైజేషన్ తరువాత ఇంతగా సమస్యలు వచ్చేవి కావని... అన్నిచోట్లా బ్యాంకుల్లో అక్రమాలు జరిగాయని చెబుతోంది. అయితే.. బ్యాంకులపై స్టింగు ఆపరేషన్లు మోడీ ఆలోచనతోనే చేపట్టారట.