Begin typing your search above and press return to search.
మోదీ నోట ఎన్టీఆర్!.. బాబుకేమీ తీసిపోని కాంగ్రెస్!
By: Tupaki Desk | 7 Feb 2019 4:20 PM GMTఎటు నుంచి ఎటు వస్తున్నా... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని వెన్నుపోటు అస్త్రం వెంటాడుతూనే ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతో పాటు ఆయన చేతుల కష్టం మీద దక్కిన అధికారాన్ని కూడా హస్తగతం చేసేసుకున్నారు. వైస్రాయ్ హోటల్ వేదికగా సాగిన నాటి చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ఎంత చెప్పుకున్నా తక్కువే. తన స్టామినా మీద గెలిచిన ఎమ్మెల్యే లను పిలుచుకునేందుకు వచ్చిన ఎన్టీఆర్ పై చెప్పులేయించిన చంద్రబాబు పై ఎన్నటికీ చెరిగిపోని మరక పడిపోయింది. ఈ తరహా మరక కాంగ్రెస్ పైనా ఉందని స్వయంగా నరేంద్ర మోదీ చెప్పేశారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తున్న కొన్ని పార్టీలు... దేశంలో అస్థిరతకు చోటిచ్చేలా మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలకు మోదీ పార్లమెంటు వేదికగా నేటి మధ్యాహ్నం ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదనే చెప్పాలి. తమను దోషులుగా ఎత్తి చూపుతున్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిందో చూసుకోవాలని సెటైరికల్ విమర్శలు గుప్పించిన మోదీ... బాబు తరహా మరక కాంగ్రెస్ పైనా ఉందని చెప్పకనే చెప్పేశారు. మోదీ స్పీచ్ లో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావన లేకున్నా... మోదీ నోట ఎన్టీఆర్ మాట వినగానే అందరికీ చంద్రబాబే గుర్తుకు వచ్చారు.
అయినా మోదీ ఏమన్నారన్న విషయానికి వస్తే... దేశంలోని పలు రాష్ట్రాల్లోని విపక్షాలకు చెందిన ప్రభుత్వాలను అస్థిరపరచడంతో పాటుగా ఆయా ప్రభుత్వాలను కూల్చేందుకు మోదీ సర్కారు కుట్ర చేస్తున్నారన్న విమర్శల పై స్పందించిన మోదీ... నాడు ఏపీలో ఎన్టీఆర్ - తమిళనాట ఎంజీఆర్ ప్రభుత్వాల పట్ల మీరెలా వ్యవహరించారో చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు ఎన్టీఆర్ సర్కారును కూల్చలేదా? అంటూ మోదీ ధ్వజమెత్తారు. సంస్థలను నిర్వీర్యం చేస్తున్నానని తన పై ఆరోపణలు సంధిస్తున్న కాంగ్రెస్ పార్టీ... నాడు ఎన్టీఆర్ కు ఏం చేసిందో, ఎంజీఆర్‌కు ఏం చేసిందో తనకు తెలుసునని మోదీ సెటైర్లు విసిరారు. ఎన్టీఆర్ సర్కారును పడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన పై విమర్శలు గుప్పించడం చూస్తుంటే.. విడ్డూరం కాక మరేమిటని కూడా మోదీ తనదైన శైలి వ్యంగ్యాస్త్రాలను సంధించారు. మొత్తంగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది ఒక్క చంద్రబాబు మాత్రమే కాదని, కాంగ్రెస్ కూడా ఆ తానులోని ముక్కేనని తేల్చి పారేశారు.