Begin typing your search above and press return to search.
మోదీ రాసిన బుక్స్ లో ఏముందంటే....
By: Tupaki Desk | 5 July 2017 12:19 PM GMTప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల కోసం ఓ పుస్తకం రాస్తున్నారన్న విషయం తెలిసిందే. పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడం తదితర అంశాలపై ఆయన ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వనున్నారు. ఈ పుస్తకాన్ని అనేక భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే, ఆయనలో ఓ పూర్తి స్థాయి రచయిత ఉన్నాడనే సంగతి చాలామందికి తెలియదు. మోదీ గతంలో రాసిన కొన్ని పుస్తకాలు ప్రాచుర్యాన్నిపొందాయి. ఆయన కేవలం ఒక అంశానికే పరిమితం కాలేదు. తల్లిప్రేమ - పర్యావరణ మార్పులు - ప్రకృతి - పేదరికం - విద్య..వంటి అంశాలపై విపులంగా రాయగలరు.
విద్యార్థి దశ నుంచి ప్రజా సేవకుడిగా మారి ప్రధాని అయ్యేంత వరకు ఆ రచన కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మోదీ రాసిన కొన్ని పుస్తకాల సమాచారం.మోదీ తన 36వ ఏట రాసుకున్న డైరీ నే 'సాక్షి భావ్' పేరుతో పుస్తక రూపమిచ్చారు. ఈ పుస్తకానికి ఉన్న మరో పేరు ‘ది విట్ నెస్ స్టేట్’. ఇందులో అన్నీ పద్యాలే ఉంటాయి. మోదీ డైరీ రాసుకున్న ఆరు నెలల తర్వాత దాన్ని కాల్చేస్తారు. కొంతమంది స్నేహితులు ఆ డైరీలను తగలబెట్టడం ఆపేయించారు.
1977లో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీపై 'ఆపత్కల్ మే గుజరాత్' అనే పుస్తకం రాశారు. 2008లో 'జ్యోతిపుంజ్' అనే పుస్తకాన్ని రాశారు. అప్పుడే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి ఆయన విజయం సాధించారు.2001లో 'సేతుబంధ్' అనే పుస్తకానికి మోదీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ నేత రాజాభాయ్ సహ రచయితగా వ్యవహరించారు. మోదీ గురువు గుజరాత్ ఆర్‌ఎస్‌ఎస్ మాజీ నేత లక్ష్మణరావ్ మాధవరావ్ ఇనందార్ జీవితం గురించి ఇందులో ప్రస్తావించారు.
పారిస్‌లో జరిగిన వాతావరణ సదస్సుపై 'కన్వీయెంట్ యాక్టన్- కంటిన్యూటీ ఫర్ ఛేంజ్' అనే పుస్తకాన్ని 2015లో విడుదల చేశారు. కర్బనవ్యర్థాలను నియంత్రించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి మోదీ ఇందులో రాశారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సమయంలో 'కన్వీనియెంట్ యాక్షన్: గుజరాత్ రెస్పాన్స్ టూ ఛాలెంజ్ ఆఫ్ క్లయిమెట్ ఛేంజ్' అనే పుస్తకాన్ని రాశారు. వాతావరణ మార్పులపై గుజరాత్ రాష్ట్రం చేపట్టిన ప్రయత్నాల విజయం గురించి ఇందులో ప్రస్తావించారు.
భారతదేశ సంస్కృతి, ప్రకృతికి సంబంధించిన పద్యాల సమాహారంగా 'భావ్ యాత్ర' అనే పుస్తకం, దళితులు, గిరిజనులు, మహిళలు, కుటుంబ బంధాలకు సంబంధించి 'సమాజిక్ సంరాష్ట' అనే పుస్తకం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండో నేత మాధవ్ సదాశివ్ గోల్ వాల్కర్ బయోగ్రఫీగా 'శ్రీ గురూజీ: ఏక్ స్వయంసేవక్' అనే పుస్తకం, తల్లి ప్రేమ, భావాల గురించి చిన్న చిన్న కథల రూపంలో 'ప్రేమ్‌తిర్త్' అనే పుస్తకాన్ని మోదీ రాశారు.
దేశభక్తి, పేదరికం, రైతులుకు సంబంధించిన వివిధ పద్యాల సేకరణ, మోదీ వ్యక్తిగత ఆలోచనల సమాహారమే 'ఆంఖ్ ఆ ధన్య ఛే' అనే పుస్తకం. విద్యపై మోదీ ఆలోచనలకు ప్రతిరూపంగా 'కెలవే తీ కెలవని' అనే పుస్తకాన్ని రచించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ పుస్తకాన్ని రాశారు. ఆర్‌ఎస్‌ఎస్ నేత మాధవ్‌రావ్ సదాశివరావ్ గోలోవాల్కర్ లేఖల సంగ్రహ సంపుటిగా 'పత్రరూప్ శ్రీగురూజి', విద్య గురించి రాసిన 'యోగా ఆఫ్ ఎడ్యుకేషన్' అనే పుస్తకాలు ప్రాచుర్యం పొందాయి.