Begin typing your search above and press return to search.

లాలూ కొడుకును ఆట పట్టించిన మోడీ

By:  Tupaki Desk   |   6 Jan 2017 8:13 AM GMT
లాలూ కొడుకును ఆట పట్టించిన మోడీ
X
మోడీ గురించి మాట్లాడాల్సి వస్తే.. సింఫుల్ గా ఒక్క మాటలో చెప్పేస్తూ.. ‘‘మోడీ సామాన్యుడు కాదండోయ్’’ అనేస్తుంటారు. అలాంటి మాటలకు తగ్గట్లే ఆయన తీరు ఉంటుంది. దేశ ప్రధానిగా క్షణం తీరిక లేని షెడ్యూల్స్ లో బిజీ..బిజీగా ఉండే ఆయన.. సోషల్ మీడియాలో కాస్తంత ఆసక్తికరమైన అంశంపై ఆయన అప్ డేట్ ను చూసిన రాజకీయవర్గాలు అదిరిపోయే ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది.

మోడీ ట్రాకింగ్ మరీ ఇంత లోతుగా.. విస్తృతంగా ఉంటుందా? అని నోరెళ్లబెట్టినోళ్లూ ఉండటం గమనార్హం. ఇంతలా షాక్ కు గురిచేసేలా మోడీ ఏం చేశారన్న విషయానికి వస్తే.. తాజాగా తన బీహార్ పర్యటనలో భాగంగా.. బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుగోవింద్ సింగ్ 350 జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. ముఖ్యమంత్రి నితీశ్.. బీహార్ పాలకపక్షంలో మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆయన ఇద్దరు కుమారులు మరికొందరితో ప్రధాని విందు చేశారు.

ఈ సందర్భంగా లాలూ కుమారుడు కమ్ బీహార్ ఆరోగ్య శాఖా మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. ‘‘నువ్విప్పుడు కృష్ణుడివి అయిపోయావా?’’ అని వ్యాఖ్యానించారు. ఆ మాటలకు అక్కడున్న వారంతా అదిరిపోతే.. లాలూ కొడుకు చిన్నపాటి షాక్ కు గురయ్యారట. ఎందుకిలా అంటే.. కొద్ది రోజుల క్రితం తేజ్ ప్రతాప్ శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురకు వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణుడి వేషం లాంటిది వేసుకొని.. చేతిలో పిల్లనగ్రోవిని పట్టునొకి గోవుల మధ్య గోపాలుడిగా ఫోటో దిగి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించిన ఈ ఫోటో ఉదంతం మోడీ కంట్లో పడటం.. ఆయన సందర్భానికి అనుగుణంగా ప్రస్తావించటంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. అనంతరం.. మోడీని ఉద్దేశించి పలువురు నేతలు మాట్లాడుకుంటూ.. ప్రధాని మోడీ ఇన్ని విషయాల్ని అంతలా ఎలా గుర్తు ఉంచుకుంటారు?అని విస్మయానికి గురి అవుతూ ఆసక్తిగా చర్చించుకోవటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/